Featured

Express Hari : లైఫ్ లో ఎపుడూ ఏడవలేదు… కానీ ఒక అమ్మాయి బాగా మోసం చేసింది…: ఎక్ష్ప్రెస్ హరి

Express Hari : స్టాండ్ అప్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న హరి ప్రస్తుతం ఎక్స్ప్రెస్ హరిగా పాపులర్ అయ్యాడు. విజయనగరానికి చెందిన హరి హైదరాబాద్ లో ఏదైనా పని చేసుకోవాలని వచ్చి రూమ్మేట్ గా ఉన్న పటాస్ ఫేమ్ సంజయ్ ద్వారా పటాస్ షోకి ఆడిషన్స్ కి వెళ్లగా అందులో హరి సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదట ఈటీవీ లో ‘పటాస్’ ఆ తరువాత జీ తెలుగు లో ‘అదిరింది’ లో కమెడియన్ గా పనిచేసారు. ఆ షో ఆగిపోయాక మా టీవీ లో ప్రసారమయ్యే కామెడీ షోలో ప్రస్తుతం కమెడియన్ గా చేస్తున్న హరి తన వ్యక్తిగత జీవితంలో బాధపడిన సందర్భాలను అలానే తన బ్రేక్ అప్ స్టోరీని వివరించారు.

అమ్మాయి మోసం చెయడంతో బాగా బాధపడ్డాను…

ఎక్స్ప్రెస్ హరి ప్రస్తుతం తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కామెడీ స్టార్స్ షోలో లీడింగ్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా అషు రెడ్డితో చేసిన స్కిట్స్ తో బాగా ఫేమస్ అయ్యాడు హరి. అయితే తన రియల్ లైఫ్ లో మాత్రం లవ్ కి ప్లేస్ లేదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరి తన పెయిన్ ఫుల్ లవ్ బ్రేక్ అప్ ను చెప్పాడు. ఒక మూడేళ్ళ క్రితం పటాస్ షో చేస్తున్న సమయంలో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి బాగా ప్రేమించానని చెప్పిన హరి జీవితంలో అంతగా ఎవరినీ ఇష్టపడలేదంటూ చెప్పారు.

అయితే ఆ అమ్మాయి బాగా ఖర్చు పెట్టించి చివరికి బావతో మా ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేసారు నన్ను మర్చిపో అని చెప్పి మాట్లాడటం మానేసిందట. తాను మాట్లాడటం మానేయడంతో ఒక్కసారిగా క్రుంగిపోయానని లైఫ్ లో మొదటి సారి ఏడ్చానంటూ చెప్పిన హరి ఆ లవ్ ఫెయిల్యూర్ తరువాత ఆ అమ్మాయి మోసం వల్ల ఎవరినీ ఎక్కువగా హార్ట్ కి తీసుకోకూడదాని అనుకున్నాడట. ప్రేమ ఇవన్నీ సినిమాల్లో చూపించినట్లు బయట ఉండవని త్వరగా అర్థమైందంటూ చెప్పాడు హరి. ఇక అషు రెడ్డి గురించి చెబుతూ తాను మంచి ఫ్రెండ్ అంటూ చెప్పాడు. చాలా మంచి మనసు ఉన్న అతి కొద్దిమందిలో తాను ఒక వ్యక్తి అంటూ చెప్పాడు హరి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago