Rahul Sipligunj : తెలంగాణ హైదరాబాద్ కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో సొంతంగా ఆల్బమ్స్ చేసి పెడుతూ పేరు తెచ్చుకున్నాడు. అలా మగజాతి, మంగమ్మ, మైసమ్మ వంటి ఆల్బమ్స్ తో ఫేమస్ అయిన రాహుల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమాలో మొదటిసారిగా పాట పాడిన రాహుల్ ఆ తరువాత ‘దమ్ము’ సినిమాలో వాస్తు బాగుందే పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు వచ్చిన పాట ‘రంగస్థలం’ సినిమాలో పడిన రంగ రంగ రంగస్థలాన పాట. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో సింగర్ కాలభైరవతో కలిసి పాడిన నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు ఏకంగా మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ గీతానికి తెచ్చిపెట్టింది. కెరీర్ లో మంచి సక్సెస్ చూస్తున్న రాహుల్ సిప్లిగంజ్ తన వ్యక్తిగత జీవితం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
పెళ్లి గురించి ఆలోచన…
రాహుల్ ప్రస్తుతం నాటు నాటు సాంగ్ కి అవార్డు రావడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపాడు. కీరవాణి, రాజమౌళి గారి వల్లే ఇదంతా సాధ్యమైంది అంటూ తెలిపారు. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ పెళ్లి గురించి ఇంకా ఆలోచన లేదంటూ చెప్పారు. ప్రస్తుతం కెరీర్ గురించే ఆలోచిస్తున్నట్లు పెళ్లి వాటికి టైం లేదంటూ చెప్పారు. ఇక పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. లైఫ్ లోకి వచ్చే అమ్మాయి గురించి నాకు నా గురించి తనక పూర్తిగా తెలిస్తేనే లైఫ్ బాగుంటుంది అలా కాకుండా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడను.
నా లైఫ్ స్టైల్ వల్ల అనవసరంగా మనస్పర్తలు రావడం, నా వల్ల తను ఇబ్బంది పడి నేను తన వల్ల ఇబ్బంది పడి విడిపోయే దాకా వెళ్లి లైఫ్ ని డిస్టర్బ్ చేసుకునే కంటే మనకు తెలిసిన అమ్మాయిని అర్థం చేసుకునే అమ్మాయిని చేసుకోవడం ఉత్తమం అంటూ చెప్పాడు. ఇక లవ్ గురించి ఇపుడైతే పెద్దగా తెలియదని ఎవరినైనా ప్రేమించాక చెబుతానంటూ చెప్పారు. ఇక అషు రెడ్డి తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ తనకు మంచి స్నేహితురాలు అంతే బయట ఏవేవో అనుకోవడం మామూలే అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…