Movie News

రాకింగ్ రాకేష్ పై చేయి చేసుకోబోయిన జడ్జ్ మనో .. ఏం స్కిట్ అంటూ..!

బుల్లితెరపై ప్రసారమౌతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి గురు శుక్రవారాలలో బుల్లితెరపై ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇంకొందరు అయితే ఇందులో మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఈ రెండు షోలు ఒకే ఫ్లాట్ ఫామ్ కిందికి వస్తాయి.

ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కమెడియన్ రాకేష్ మందరికి సుపరిచితమే. ఈ షోలో రాకేష్ తనదైన శైలిలో నవ్విస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు చిన్న పిల్లలతో స్కిట్ లు చేస్తుండే రాకేష్, ప్రస్తుతం రోహిణి లాంటి కొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్లు చేస్తున్నారు. రాకేష్ తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా రాకింగ్ రాకేష్ పై జడ్జిగా వ్యవహరిస్తున్న మనో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో రాకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.ఈ క్రమంలోనే మనో మాట్లాడుతూ ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు. ఐ యామ్ సో సారీ అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు మనో.మనో గారు అంటూ రోజా అంటున్నా కూడా అతడు వినకుండా ఆ చైర్ పై నుంచి దిగి వెళ్లిపోతాడు.

మనో వెళ్లకుండా అడ్డుకున్న రాకేష్ టీం సభ్యులను పైకి వెళ్లండి అంటూ కోపంతో చెబుతాడు మనో. ఐ యామ్.సారీ సార్ అంటూ రాకేష్ అంటున్నా చేయితో కొట్టబోతాడు మనో. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.సారీ మేడం అంటూ రోజాకు చెప్పి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతాడు సింగర్ మనో. అయితే ఇది కేవలం ప్రోమో కోసం చేసినట్లుగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత తెలియాలి అంటే నవంబర్ 5 న ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago