దేశంలో కరోనా రెండవ దశ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలమయ్యారని, మోదీ సర్కార్ సరైన కఠిన చర్యలు తీసుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని #ResignModi హ్యాష్‌టాగ్‌తో ఈ పోస్టులు పెడుతున్నారు.
ఈ పోస్టులను ఫేస్ బుక్ కొన్ని గంటల వ్యవధిలోనే బ్లాక్ చేసి మరి పునరుద్ధరించింది. సోషల్ మీడియాలో ఆ హ్యాష్‌టాగ్ తొలగించాలని కేంద్రం ఆదేశించడంతోనే అసలు వివాదం చెలరేగింది. అయితే ఈ విషయంపై ఫేస్ బుక్ వివరణ ఇచ్చుకుంది.#ResignModi హ్యాష్‌టాగ్ పొరపాటున బ్లాక్ అయ్యిందని,కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తాము బ్లాక్ చేయలేదంటూ వివరణ తెలిపింది.
దేశంలో కరోనా ఉద్ధృతికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్, బెడ్లు సౌకర్యం లేకపోవడమే కాకుండా స్మశానాలలోను అంత్యక్రియలకు కూడా స్థలం లేదు. మన దేశంలో ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలలో కరోనాతో మృత్యువాత పడిన బాధితుల దహనసంస్కారాలు నిర్వహించాలంటే రెండు మూడు రోజులు ఎదురు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఏర్పడటానికి గల కారణం నరేంద్రమోడీ అధికారం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనాకు సంబంధించిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రజలు వాటిని చూసి ఎంతో ఆందోళనకు గురై, కొందరు భయంతోనే ప్రాణాలు వదులుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే పోస్టులను బ్లాక్ చేయాలని సోషల్ మీడియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు గత నెల రోజుల నుంచి ట్విట్టర్ ఇటువంటి పోస్టులను నిషేధిస్తోంది. అదేవిధంగా 500కు పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…