‘మోడీ రాజీనామా’ హ్యాష్‌టాగ్‌ పోస్ట్ లు బ్లాక్.. ఎందుకంటే?

0
164

దేశంలో కరోనా రెండవ దశ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలమయ్యారని, మోదీ సర్కార్ సరైన కఠిన చర్యలు తీసుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని #ResignModi హ్యాష్‌టాగ్‌తో ఈ పోస్టులు పెడుతున్నారు.

ఈ పోస్టులను ఫేస్ బుక్ కొన్ని గంటల వ్యవధిలోనే బ్లాక్ చేసి మరి పునరుద్ధరించింది. సోషల్ మీడియాలో ఆ హ్యాష్‌టాగ్‌ తొలగించాలని కేంద్రం ఆదేశించడంతోనే అసలు వివాదం చెలరేగింది. అయితే ఈ విషయంపై ఫేస్ బుక్ వివరణ ఇచ్చుకుంది.#ResignModi హ్యాష్‌టాగ్‌ పొరపాటున బ్లాక్ అయ్యిందని,కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తాము బ్లాక్ చేయలేదంటూ వివరణ తెలిపింది.

దేశంలో కరోనా ఉద్ధృతికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్, బెడ్లు సౌకర్యం లేకపోవడమే కాకుండా స్మశానాలలోను అంత్యక్రియలకు కూడా స్థలం లేదు. మన దేశంలో ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలలో కరోనాతో మృత్యువాత పడిన బాధితుల దహనసంస్కారాలు నిర్వహించాలంటే రెండు మూడు రోజులు ఎదురు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఏర్పడటానికి గల కారణం నరేంద్రమోడీ అధికారం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాకు సంబంధించిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రజలు వాటిని చూసి ఎంతో ఆందోళనకు గురై, కొందరు భయంతోనే ప్రాణాలు వదులుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే పోస్టులను బ్లాక్ చేయాలని సోషల్ మీడియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు గత నెల రోజుల నుంచి ట్విట్టర్ ఇటువంటి పోస్టులను నిషేధిస్తోంది. అదేవిధంగా 500కు పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here