దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా 18 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లే మేజర్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఫేస్ బుక్ ఖాతా తెరవాలంటే కూడా వారికి కచ్చితంగా 13 ఏళ్లు దాటి ఉండాలి. ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఖాతా తెరవాలంటే 13 ఏళ్లు నిండి ఉండాలి. అంత కంటే చిన్న వయస్సు ఉన్న వాళ్లు ఖాతా తెరుద్దామంటే కుదరదు. అయితే తప్పుడు వయస్సు నమోదు చేసుకొని ఇటీవల ఫేస్ బుక్ ఖాతాలు తెరుస్తున్నారు.
ఈ విషయంలో యూజర్లకు పలు సార్లు సూచనలు చేస్తూనే ఉంది. అయినా ఎవరూ ఏ మాత్రం వినిపించుకోకుండా ఖాతాలు తెరుస్తున్నారు. తాజాగా వీటికి చెక్ పెట్టేందుకు ఫేస్‌బుక్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సిద్ధం చేస్తోందని సమాచారం. దాని ప్రకారం తప్పుగా వయస్సు చెబితే వెంటనే కనిపెట్టేస్తుందట. ఒకవేళ 13 ఏళ్ల కంటే తక్కువ ఉంటే… వారికి ప్రత్యేకమైన ఫీచర్లు అందించడానికి ప్రయత్నాలు చేస్తోందట.
దీని కోసం ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ తో ఫేస్ బుక్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. తప్పుడు వయస్సు ఎంటర్ చేసిన అభ్యర్థి సమాచారాన్ని ఇంటర్నెట్ బ్రౌజర్లు, ఇతర సంస్థలతో సమాచారాన్ని షేర్ చేసుకొని… వాళ్ల నుంచి అవసరమైన సమాచారం తెలుసుకొని యూజర్ల వయసు లెక్కిస్తారట. దీనిపై ఫేస్‌బుక్ మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ ఖాతాల ఓపెనింగ్ కోసం ప్రత్యేక ఐడీ కూడా ఉండాలనే ప్రతిపాదన ఉంది. ఐడీల వల్ల కొన్ని సమస్యలు వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సరైన ఐడీలు సబ్మిట్ చేస్తారని కూడా నమ్మలేం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయత్నాలు కనుక ఫలిస్తే 13 ఏళ్లు అంతకంటె తక్కువ వయస్సు ఉన్న వాళ్లను సింపుల్ గా తెలుసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…