వర్షాకాలాన్ని చాలామంది వ్యాధుల కాలం అని కూడా అంటారు. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీంతో ఆ వ్యాధులతో పాటు పాటు జీర్ణవ్యవస్థ బాగా దెబ్బతిని ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు చుట్టుముడతాయి. మిగతా సీజన్ లతో పోల్చుకుంటే వార్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతుంటారు.
జంక్ ఫుడ్ ను నివారించడంతో పాటు వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోడ్ల పక్కనే అమ్మే తిను బండారాలకు ఎంత వీలుంటె అంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థకు ఆటకం ఏర్పడుతుంది. ఇది గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు దారితీస్తుంది.
మీరు తీసుకునే ఆహారం వర్షాకాలం సీజన్ లో మాత్రం తప్పకుండా అల్లం, నిమ్మకాయను చేర్చుకుంటే జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడానికి వీలుంటుంది. పెరుగు లేదా మజ్జిక లాంటివి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థను మెరుగుపడే అవకాశం ఉంటుంది. నీటిని కూడా ఎక్కువగా తాగాలి. పచ్చి కూరగాయలను అస్సలు తినకూడదు. ఉడికించిన కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
రిఫైన్డ్ షుగర్ తినవద్దు. ఎందుకంటే ఇది వాపు, గట్ ఫ్లోరా బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంది. ఫ్రై చేసిన ఆహార పదర్థాలను అస్సలు తీసుకోవద్దు. ఆహారం తిన్న వెంటనే పడుకోకండి. తిన్న వెంటనే మంచినీళ్లు కూడా తాగొద్దు. కొద్ది సమయం తర్వాత వాటర్ తీసుకోవాలి. తిన్న ఆహారం మంచిగా జీర్ణం కావాలంటే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…