సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి కథ మీద అవగాహన ఉందని బాగా వారికి వారే డబ్బా కొట్టుకుంటారు. ఏదో చేయాలని ఇంకేదో చేసి సరికి నిర్మాతను నట్టేట ముంచేస్తారు. దానివల్ల నిర్మాత అనేవాడు మళ్లీ సినిమా అన్నా సినిమా ఇండస్ట్రీ అన్నా భయంతో చమటలు పట్టి చేతులెత్తి దణ్ణం పెట్టేస్తారు. ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు చేసి నిర్మాతలని ముంచేసిన దర్శకులు చాలామందే ఉన్నారు. ఒకసారి ఒక కాంబినేషన్ హిట్ అయితే మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా చేస్తే జనాలలో క్రేజ్ ఉంటుందని ఏదో చెత్త కథ తీసుకువచ్చి నిర్మాత పాయింట్ బాగాలేదని చెప్పినా వినకుండా మీరు ఈ జనరేషన్ కి తగ్గట్టు ఆలోచించడం లేదు. మీరి డబ్బు పెట్టండి.. అంతా నేను చూసుకుంటాను అంటే బాగా
తెలిసిన వాడు కదా అని మొహమాటానికి పోయి తర్వాత భరించలేని నష్టం వచ్చి అడ్రస్ లేకుండా పోయిన నిర్మాతలు ఎంతో మంది.
అలాంటి నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు. మహారధి ఫిలింస్ అనే నిర్మాణ సంస్థలో అల్లరి నరేష్ హీరోగా లడ్డుబాబు సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తమ్ముడు రాజేంద్ర. ఆయనకి వ్యాపారాలు తప్ప సినిమా రంగంలో పెద్దగా అనుభవం లేదు. అయితే ఈ నిర్మాణ సంస్థలో వాళ్ళ నాన్నగారు మహారది సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆయన పేరు మీద స్థాపించిన దీని మీదే రవిబాబు దర్శకుడిగా లడ్డు బాబు నిర్మించారు. రవి బాబు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా మారుతూ అల్లరి సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు నరేష్ ని హీరోగా పరిచయం చేశాడు.
అల్లరి సినిమా హిట్ అవడంతో ఏకంగా నరేష్ పేరు అల్లరి నరేష్ గా మారింది. ఈ సినిమా ఎలా హిట్ అయిందో హిట్ అయింది. ఆ తర్వాత నుంచి రవిబాబు దర్శకుడుగా నువ్విలా, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, లడ్డు బాబు, అదుగో, ఆవిరి లాంటి సినిమాలు తీశాడు. వీటిలో ఒక్క నచ్చావులే తప్ప మిగతావేవి పెద్దగా హిట్ సాధించలేదు. కొత్తగా తీయడానికి ట్రై చేస్తున్న రవిబాబు సెకండాఫ్ కథ సరిగ్గా డీల్ చేయలేదని టాక్ వినిపిస్తుంది. భూమికతో తీసిన అనసూయ, తరుణ్ – ఆర్తి అగర్వాల్ తో తీసిన సోగ్గాడే, అమరావతి లాంటి సినిమాలు బావున్నప్పటికి బ్లాక్ బస్టర్ అయింది లేదు.
అయితే రవిబాబు తీసిన కొన్ని సినిమాలు మరీ భారీగా నష్టపోయినవి లేవు. అందుకే నిర్మాతలు ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో అల్లరి తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ – రవిబాబు కాంబినేషన్ లో లడ్డు బాబు సినిమా వచ్చింది. సన్నగా చీపురు పుల్లలా ఉండే నరేష్ ని ఎయిర్ బెలూన్ లా చూపించాడు. ఏదో దోమ కుట్టి వైరస సోకడంతో ఉన్నపలంగా లడ్డు బాబు లావుగా మారిపోతాడు. అతనికి పెళ్ళిచేయాలనుకున్న తండ్రికి అదొక సమస్యగా మారుతుంది. అయితే పుట్టిన బిడ్డకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, అంగ వైకల్యం ఉన్న తల్లీ తండ్రికి ఆ బిడ్డ ఎప్పటికీ బంగారమే.
ఇది ప్రపంచంలో ప్రతీ తల్లి తండ్రికి ఉండే పేగు బంధం. ఒక వ్యక్తిలోని లోపాలను, అంగ వైకల్యాన్ని ప్రపంచం మొత్తం హేళన చేసినా అమ్మా, నాన్నలు మాత్రం బిడ్డను అపురూపంగా చూసుకుంటారు. అయితే ఇదే పాయింట్ ను రవిబాబు రివర్స్ లో చెప్పి ఏదో కొత్తగా దేశానికి చెప్పాలనుకున్నాడు. ఈ పాయింటే సరైనది కాదు. హ్యూమన్ ఎమోషన్ ఎప్పుడు నెగిటివ్ గా చూపిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ఇదే విషయం నిర్మాత నెత్తి నోరు కొట్టుకొని దర్శకుడు రవి బాబుకి చెప్పాడు. అయినా ఆయన వినిపించుకోలేదు. మీరు ఇంకా ఓల్డ్ మైండ్ సెట్ అండ్ థింకింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ కి కావాల్సింది ఇలాంటి కథలే అని మొండిగా వాధించాడు.
దానికి హీరో నరేష్ కూడా వంతపలికాడు. మేమేదో కుర్రాళం. సరదాగా సినిమా చేసుకుంటున్నాము. పైగా మా కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. మీరు చూస్తు ఉండండి అంకుల్. మంచి సినిమా అవుతుందంటే నిర్మాత కథలో ఉన్న లోపాలను సరిచేయలేక సరే అన్నాడు. తీరా సినిమా ఫస్ట్ కాపీ చూసిన దర్శకరత్న దాసరి నారాయణ రావుగారు.. తిట్టి పెట్టారు. మీ నాన్నగారి బ్యానర్ మీద ఇలాంటి సినిమా తీస్తావా. కొద్దిగైనా ఆలోచన ఉందా. ఇంత దరిద్రమైన కథ తప్పితే వేరేది దొరకలేదా అన్నారట. ఆయన అన్నట్టుగానే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక మంచి ఆఫర్ వచ్చినప్పుడు కూడా రవిబాబు దాన్ని వద్దని ఇంకా పెద్ద ఢీల్ వస్తుందని చివరికి సినిమా ఎవరూ కొనని పరిస్థితికి తీసుకు వచ్చాడు. ఫలితంగా లడ్డు బాబు నిర్మాతకి భారీ నష్టాలను మిగిల్చింది.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…