Faima: జబర్థస్త్ లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫైమా ఆ షోలో తన కామెడీ పంచులు, సెటైర్లతో బాగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని అక్కడ కూడా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు దగ్గర లేడీ కమెడియన్ గా బాగా పాపులర్ అయింది. ఇక జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో పైమా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చాలా కాలం కొనసాగిన ఫైమా ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చింది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫైమా పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల ఫైమా గుర్తింపు పెరగటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆమె నిలదొక్కుకుంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫైమా ఎంతో కష్టపడి లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది.
అయితే పైమా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలన్న ఆశతో తల్లితండ్రులను ఒప్పించి ఉన్న ఊరు విడిచి నిలువ నీడలేని స్థితిలో హైదరాబాద్ చేరుకున్న ఫైమా ఇప్పుడు కష్టపడి సొంత ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పారితోషికంతో ఫైమా ఒక ఇంటిని నిర్మించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ తర్వాత కూడా మాటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ షోలో ఫైమా సందడి చేస్తూ ఆదాయం పొందుతోంది. అంతేకాకుండా బయట కూడా పలు ఈవెంట్లలో పాల్గొంటూ డబ్బు సంపాదిస్తోంది. ఇలా కష్టపడి పనిచేసి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా పెట్టుకుని సొంత ఇల్లు, కారు సమకూర్చుకొని కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పైమా కూడపెట్టిన ఆస్తుల విలువ కోటి దాకా ఉంటుందని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…