Featured

Hero Shivaji : వాడిని నడి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొట్టా…: నటుడు శివాజీ

Hero Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించిన హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ . అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీ కి కే.ఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. అలా ఇండస్ట్రీ కంట పడిన శివాజీ ఆపైన మాస్టర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

వాడిని కొట్టినా చెప్పుకోలేడు…

ఎంతో మందికి సహాయం చేసినా వాళ్ళు నా సహాయం తీసుకుని నా గురించే చెడుగా చెప్పేవాళ్ళను నా లైఫ్ లో చూసాను. ఇవన్నీ చెబితే చాలా సంఘటనలు ఉన్నాయి. నా వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వాళ్ళు పక్కకు పోయి నా గురించి మర్యాద లేకుండా మాట్లాడినవాళ్ళు నాతోనే ఉంటూ నన్ను తొక్కేసిన వాళ్ళు ఉన్నారు.

ఇక ఇంటర్వ్యూలో మన విషయాలను చెబితే వాళ్ళు హైప్ రావడానికి పెట్టే థంబ్ నైల్ వల్ల మళ్ళీ ఒక సమస్య. ఒక ఏడాది క్రితం ఒకడు నా ఇంటర్వ్యూ తీసుకుని పిచ్చి పిచ్చి థంబ్ నైల్ పెట్టాడు. ఒకరోజు కనిపిస్తే రోడ్డులోనే కొట్టాను ఎం మాట్లాడకుండా వెళ్లి ఆ వీడియో డిలీట్ చేసాడు. వాడు నేను కొట్టిన సంగతి ఎవరికీ బయటకి చెప్పుకోలేడు అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago