Faima: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కేవలం పురుషులు మాత్రమే కాకుండా మహిళలు కూడా కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్గా గుర్తింపు పొందిన వారిలో ఫైమా కూడా ఒకరు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఫైమా అక్కడ తన పంచు డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో జబర్దస్త్ షో నుండి అవకాశాలు అందుకుంది.
బుల్లెట్ భాస్కర్ టీం లో ఫైమా చేసిన స్కిట్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఫైమా జబర్థస్త్ ద్వారా లేడీ కమెడీయన్ గా బాగా పాపులర్ అయింది.
ఇక జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో చాలా కాలం కొనసాగిన ఫైమా ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. బిగ్ బాస్ ద్వారా ఫైమా గుర్తింపు పెరగడమే కాకుండా ఆమె ఆర్థికంగా కూడా నిలదొక్కుకుంది.
ఇదిలా ఉండగా జబర్దస్త్ పటాస్ షోలో దాంతోపాటు కలిసి పనిచేసిన ప్రవీణ్ తో ఫైమామ్ ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ కూడా ప్రేమికులుగా టీవీ షోలలో సందడి చేశారు. దీంతో వీరిద్దరూ భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే తాజాగా మాటీవీలో ప్రసారమైన ఒక టీవీ షోలో పాల్గొన్న ఫైమా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ క్రమంలో పైమా మాట్లాడుతూ ‘తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనని ఒక చంటి పిల్ల లాగా చూసుకోవాలని,అంతేకాకుండా ప్రతి విషయంలో తనకు సపోర్ట్ చేయాలి అని.. మంచివాడు అయ్యుండాలి’ అంటూ ఫైమ తెలిపింది. అయితే బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చిన తరువాత ఫైమా ప్రవీణ్ ఇద్దరు కలిసి కనిపించటం లేదు. ప్రవీణ్ ఈటీవీ షోలలో సందడి చేస్తూ బిజీగా ఉండగా పైమాకి జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో మాటీవీలో ప్రసారమవుతున్న షోలలో సందడి చేస్తోంది.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…