Fake news about Senior actor kavitha : తరచూ యూట్యూబ్ లో సీనియర్ నటులు చనిపోయినట్లు ఫేక్ ఫొటోలతో వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఈ వీడియోలను నమ్మొదంటూ సదరు వ్యక్తే మళ్ళీ ఒక వీడియో విడుదల చేసే కాలం వచ్చింది. మేము చనిపోలేదు మహాప్రభో బ్రతికుండగానే మమ్మల్ని చంపకండి అంటూ వాళ్లు మళ్ళీ ప్రకటించాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితి సీనియర్ నటులు చాలా మంది ఎదుర్కొన్నారు. దివంగత ఎస్ పి బాలు ని కూడా ఇలానే ఫేక్ రాయుళ్ళు చంపేశారు. ఆయన మళ్ళీ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. ఇక షకీలా, చంద్రమోహన్, రంగస్థలం మహేష్ లాంటి వాను కూడా ఈ ఫేక్ రాయుళ్ళు వ్యూస్ కోసం చంపేశారు. ఇక వారి బంధువుల ద్వారా విషయం తెలుసుకుని అలాంటిదేమి లేదని ఆ వ్యక్తులు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.
సీనియర్ నటి కవిత మరణించిందంటూ ఫేక్ న్యూస్…..
ఇక ఇపుడు కొన్నిరోజులుగా తెలుగు సీనియర్ నటి తెలుగుదేశం పార్టీ లో కుడా పని చేసిన కవిత మరణించిందంటూ యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఇక ఈ న్యూస్ చూసినా కవిత బంధువులు ఆమెకు ఫోన్ చేసి వాకబు చేసారు. ఇక వీడియోలు చూసినా కవిత మీడియా ముందుకు వచ్చి తాను బ్రతికే ఉన్నట్లు అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పక తప్పలేదు. దయచేసి ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దు. నేను చెన్నైలో జీ టీవీ సీనియర్ షూటింగ్లో పాల్గొంటున్నాను. ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు కూడా దయచేసి ఇది ఆపండి, అలాగే ఆ వీడియోలను డిలీట్ చేయండి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు ఎక్కువయ్యాయి . కొందరు ఆకతాయి మూక పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…