Sujatha and Rakesh : జబర్దస్త్ వేదిక పై చిన్న పిల్లలతో స్కిట్లు చేయిస్తూ గుర్తింపు పొందిన కమెడియన్ రాకింగ్ రాకేష్. జబర్దస్త్ లో ప్రేమా జంటలను కూడా బాగానే ప్రమోట్ చేస్తుంటారు. ఇక జబర్దస్త్ ప్రేమ జంట అనగానే సుధీర్ రష్మీ గుర్తొస్తారు. వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాములుగా ఉండదు. వీళ్ల మధ్య ఏమి లేదు కేవలం టీఆర్పి కోసమే అంత అని అందరూ అనుకున్న కానీ స్క్రీన్ మీద వీళ్ల జంట చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది.
ఇక ఆ తరువాత ఇమ్మానుయేల్ వర్ష జంట ను కూడా ఇలాగే ప్రమోట్ చేసారు కానీ అది అంత వర్క్ అవుట్ అవ్వలేదు. ఏదేమైనా ఇవన్నీ ఉత్తుత్తి జంటలే. కానీ జబర్దస్త్ వేదిక నిజమైన జంట ఎవరు అంటే ప్రస్తుతం జోర్ధార్ సుజాత రాకింగ్ రాకేష్. వీళ్లిదరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు పలు షోలలో తెలిపారు. ఇక వారి వారి ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించినట్లు సమాచారం. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈ జంట జబర్దస్త్ వేదికపైన అలాగే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
ఫోన్ బహుమతిగా ఇచ్చిన సుజాత….
స్కిట్ల ప్రాక్టీస్ కోసం రాకేష్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న సుజాత అతడు తన ఫోన్‌తో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించింది. అతడికి తన కానుకగా ఓ ఖరీదైన ఫోన్‌ను అందించింది. సామ్ సంగ్ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్ వాచ్‌ను కొనిచ్చి రాకేష్ ను సర్‌ఫ్రైజ్ చేసింది . సుజాత రాకేష్‌కు గిఫ్ట్ ఇస్తున్న వీడియోను తన అఫిషియల్ యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసింది. రాకేష్ కి కోపం వస్తే ఫోన్ పగులగొట్టే అలవాటు ఉందని అందుకే తాను ఫోన్ కొనివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. నన్ను ఎంతో ఇష్టపడే రాకేష్ నేను ఇచ్చిన ఫోన్ పగలగొట్టాడు అనే ఉద్దేశంతో కొనిస్తున్నట్లు యూ ట్యూబ్ ఛానల్ వీడియోలో వివరించింది. నెట్టింట్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మరీ ఈ ఫోన్ అయిన రాకేష్ భద్రంగా ఉంచుకుంటాడేమో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…