Ntr -Ram Charan: అభిమానుల మధ్య చిచ్చు రేపిన నాటు నాటు సాంగ్… ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!
Ntr -Ram Charan: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25 న విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మూడు వారాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులను ఇరగదీసిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వీడియోని విడుదల చేశారు.
ఈ వీడియోని చూసిన అభిమానులు ఇద్దరు హీరోల డ్యాన్సు ను చూసి ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత రామ్ చరణ్ కు సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో రాజమౌళిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఇద్దరు హీరోలతో సమానంగా చూపించారు అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు చల్లబడ్డారు.
ఇదిలా ఉంటే తాజాగా నాటు సాంగ్ విడుదల చేయడంతో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఈ వివాదం మరింత పెద్దది చేసింది. తాజాగా విడుదల చేసిన ఆ వీడియో లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు అద్భుతంగా డాన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ ఈ పాటలో పోలికలు వివాదాన్ని రాజేస్తున్నాయి. ఎన్టీఆర్ స్టెప్పుల్లో తేలిపోయాడని, సరైన మూమెంట్స్ ఇవ్వడం లేదను చరణ్ ఫ్యాన్స్ ఉంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ కూడా సరిగా స్టెప్పులు వేయలేదని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో వేయడానికి రామ్ చరణ్ కూడా పలు చోట్ల తడబడ్డాడని తారక్ ఫాన్స్ అంటున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని అనగా, రామ్ చరణ్ అభిమానులు ఏ మాత్రం తగ్గకుండా కామెంట్ల వరకు మాత్రమే కాకుండా ఏకంగా పాటని స్క్రీన్ షాట్ తీసి మరి ఇదిగో ప్రూఫ్ అంటూ నిలదీస్తున్నారు. ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. మరి ఈ విషయంపై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇలా ఈ హీరో ఇద్దరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవ పడటం చూస్తూ మరికొందరు నెటిజన్లు వీరి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…