Farah Kausar : సింగర్ యశస్వి చెప్పేది అపద్ధం… ఆ ట్రస్ట్ కి ఆయనకు సంబంధం లేదు… నవసేన ఫౌండేషన్ మెంబెర్ ఫరా కౌసర్

Farah Kausar : జీ తెలుగు సరిగమప సింగింగ్ ద్వారా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యశస్వి కి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. యశస్వి ‘జాను’ సినిమాలోని ‘ది లైఫ్ అఫ్ రామ్’ సాంగ్ పాడి ఒక్కసారిగా అందరి మనసును దోచుకున్నారు. ఒరిజినల్ సింగర్ కన్నా ఆ సాంగ్ అద్భుతంగా పాడాడంటూ ప్రశంసలు అందుకున్న యశస్వి మరోవైపు వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటూనే అలానే యూట్యూబ్ ఛానెల్ ద్వారా సాంగ్స్ పాడుతూ అందరికీ చేరువవుతున్నాడు. తాజాగా యశస్వి ఒక సేవా సంస్థకు పని చేస్తున్నట్లు అలానే ఆ సేవా సంస్థకు సహాయం చేస్తున్నట్లు వార్తలను నడుమ అవన్నీ అపద్దాలు అంటూ ఆ సేవా సంస్థ మెంబెర్ మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో ఒక్కసారిగా యశస్వి వైరల్ అవుతున్నాడు.

యశస్వి చెప్పేది అపద్ధం…

యశస్వి నవసేన ఫౌండేషన్ కి సహాయం చేస్తున్నట్లు, ఆ సేవా సంస్థ కోసం పనిచేస్తున్నట్లు ఒక ప్రముఖ ఛానెల్ లో వీడియో రావడంతో ఆ సేవా సంస్థ మెంబెర్ ఫరా కౌసర్ మీడియా ముందు మాట్లాడుతూ అలంటిదేమీ లేదని, యశస్వి అస్సలు ఇక్కడికి ఎపుడూ రాలేదంటూ చెప్పారు. ఆయన సహాయం చేసారని ఇక్కడ ఉన్న ఆడపిల్లలకు మొత్తం బాధ్యత తానే తీసుకున్నట్లు చెప్తున్నారు అటువంటివేమి జరగలేదని చెప్పారు. యశస్వి తరుపున ఒక అమ్మాయి వచ్చి కేవలం వీడియో తీశారు. అది కూడా ముందుగా పర్మిషన్ తీసుకోలేదు. మామూలుగా ఎవరైనా పుట్టినరోజు వంటివి జరుపుకోడానికి ఇక్కడ అనుమతి ఇస్తుంటాం అలా చేశారే కానీ మాకు ఎటువంటి సహాయం చేయలేదు.

అతనికి తెలిసే ఇదంతా జరిగిందా లేక ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందో తెలియదు. కానీ టీవీలో మా సంస్థ బోర్డు చూడటంతో కొంత మంది ఫోన్ చేసి మీ ఫౌండేషన్ కు దాతలు దొరికారా అని అడిగినపుడు వీడియో చూసాము. ఆబ్జెక్షన్ పెట్టడం వల్ల పూర్తి వీడియో చూపించలేదు. అయినా సహాయం చేయకపోయినా చేశామని చెప్పుకున్నందుకు మాత్రమే వారి పై ఇలా మాట్లాడాల్సి వస్తోంది. ఇది జరిగి దాదాపు నెల కావొస్తున్నా యశస్వి కి ఈ విషయం తెలియదు అంటే నమ్మేలా లేదు. ఆయన వరకు ఇది వెళ్లి ఆయన వివరణ ఇచ్చిన దాని ప్రకారం ఏం చేయాలో ఆలోచిస్తాం అంటూ చెప్పారు ఫరా కౌసర్.