Movie News

ఆ స్టార్ హీరో తో ఛాన్స్ కొట్టేసిన జాతిరత్నాలు హీరోయిన్..?

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఉప్పెన తర్వాత ఆ లెవెల్లో హిట్ అయిన సినిమా జాతిరత్నాలు.. క్రాక్ సినిమా తో ఆఫ్టర్ కోవిడ్ టాలీవుడ్ మళ్ళీ తన సత్తాని చాటుకుంది.. దాన్ని కొనసాగిస్తూ ఉప్పెన సినిమా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు . ఆ జోరును కొనసాగిస్తూ జాతిరత్నాలు సినిమాలు ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతూ వస్తుంది.. రిలీజ్ అయ్యి ఐదురోజులవుతున్నా జాతిరత్నాలు హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. నవీన్ పోలిశెట్టి క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది.ఈ చిత్రం శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న విడుద‌లై సూప‌ర్ టాక్ తెచ్చుకుంది.మొదటినుంచి ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే నమ్మాల్సిందే..

ఇక నవీన్ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఫరియా అబ్దుల్లా కి కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయంలో ఈవిడేంటి ఇంత పొడవుంది అని ప్రభాస్ చేసిన ఒక్క కామెంట్‌తో ‘ఫరియా అబ్దుల్లా’కి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ వచ్చింది. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరి చూపు ఆమెపైనే పడింది. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లాకి మాస్ మహారాజా బంపర్ ఆఫర్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న రవితేజ.. తన తర్వాతి సినిమాను త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాని హీరోయిన్‌గా తీసుకుంటే బెటర్ అని దర్శకనిర్మాతలతో రవితేజ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago