Movie News

నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సినిమా తోనే..?

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.. సాయి పల్లవి కథానాయిక.. ఇటీవలే రిలీజ్ అయినా సారంగదారియా సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలవడం విశేషం.. ఈ ఒక్క పాటవల్ల ఇప్పటివరకు సినిమాపై లేని అంచనాలు భారీగా పెంచాయి..ఇందులో సాయి పల్లవి డాన్స్ కి అందరు ఫిదా అవుతున్నారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినిమాకోసం ఎదురు చూస్తున్నారు..

ఇకపోతే నాగ చైతన్య కి కూడా ఈ సినిమా ఎంతో ముఖ్యం ఎందుకంటే అయన గత చిత్రాలు ఎంతో నిరాశ పరచగా ఈ సినిమా తో మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. దాంతో ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యమైంది.. అక్కినేని అభిమానులకు ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలే ఉన్నాయి.. ఫిదా లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేస్తుండగా సాయి పల్లవి కూడా నటిస్తుండడం ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి కారణం..

ఇకపోతే నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే నాగచైతన్య మొదటిసారి బాలీవుడ్ సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది కూడా స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రలో చైతన్యకు ఛాన్స్ ఇచ్చినట్లు ట్తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మెరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. ఇక లవ్ స్టొరీ అనంతరం థాంక్యు సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago