ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రధారులుగా వైజయంతి నెట్ వర్క్ పతాకంపై తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు.. నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కి అనుదీప్ అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కి మంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది.. హీరోకి నవీన్ పోలిశెట్టి కి ఈ సినిమా హిట్ మంచి బూస్ట్ లాంటిది అని చెప్పొచ్చు.
ఏ క్షణాన ఈ సినిమా ని మొదలుపెట్టారు కానీ ఈ సినిమా కి మొదటినుంచి మంచి టాక్ వచ్చింది. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే నమ్మాల్సిందే.. విడుదలై ఐదు రోజులవుతున్న ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది.ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి11న విడుదలై సూపర్ టాక్ తెచ్చుకుంది.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బ్లాక్‌బస్టర్ అయిన ‘ఉప్పెన’కు కూడా 2 లక్షల డాలర్ల లోపే వసూళ్లు వచ్చాయి. కానీ ‘జాతిరత్నాలు’తో కథ మారిపోయింది. ఈ సినిమా కోసం అక్కడి జనాలు ఎగబడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ సినిమా చూస్తున్నారు. దీంతో ప్రిమియర్స్ నుంచే ‘జాతిరత్నాలు’ 1.33 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. కరోనా విరామం తర్వాత ఓ ఇండియన్ సినిమాకు వచ్చిన అత్యధిక ప్రిమియర్ వసూళ్లు ఇవే. తర్వాతి రోజుల్లో కూడా జోరు కొనసాగించింది. శనివారానికే ‘జాతిరత్నాలు’ 5.38 లక్షల డాలర్లు రాబట్టింది. దీంతో కరోనా బ్రేక్ తర్వాత అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన భారతీయ చిత్రంగానూ ఇది రికార్డులకెక్కింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…