Movie News

అనిల్ రావిపూడి బ్రాండ్ ఒక్క సినిమాతో చెదిరిపోయిందా..!!!

తొలి సినిమా పటాస్ నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనిల్ రావిపూడి.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ గా ఉన్నారు. అందులో ఒకరు అనిల్ రావిపూడి. తొలి సినిమా హిట్ కాగానే డైరెక్టర్స్ రెండో సినిమాతోనే తుస్ మనిపిస్తారు. కానీ సినిమా సినిమా కి ఎదుగుతూ ఒదిగి మళ్ళీ మళ్ళీ హిట్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి..ప్రస్తుతం అయన దర్శకత్వంలో F3 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్నీ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F2 ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఫామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. దీని సీక్వెల్ F3 పైన కూడా మరిన్ని అంచనాలు ఉన్నాయి.. ఇకపోతే గాలిసంపత్ ఇటీవలే ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సినిమా కు స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. ఈ చిత్రానికి సమర్పకుడు కూడా అతనే.

ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు అన్నీ అనిల్ రావిపూడినే.ఈ చిత్రానికి అనిల్ మిత్రుడైన కృష్ణ కథ అందించడమే కాదు.. పెట్టుబడి పెట్టి నిర్మించాడు కూడా. పేరుకు ఈ చిత్రానికి దర్శకుడు అనీష్ కృష్ణ కానీ.. మొత్తం అనిల్ చేతుల మీదుగానే నడిచింది. ఈ సినిమాను విజయవంతం చేసిన తన బ్రాండును పెంచుకోవాలని అనిల్ అనుకున్నాడు. కానీ ‘గాలి సంపత్’ అనిల్‌కు ఉన్న పేరును చెడగొట్టేసింది. ఈ సినిమా చూసిన వాళ్లంతా మంచి కథను అనిల్ చెడగొట్టేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హృద్యంగా తీయాల్సిన కథను అనిల్ తాను తీసే కమర్షియల్ సినిమాల స్టయిల్లోనే డీల్ చేయడంతో సినిమా ఆరంభంలోనే పట్టాలు తప్పేసింది. అంటున్నారు..

 

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago