అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.. సాయి పల్లవి కథానాయిక.. ఇటీవలే రిలీజ్ అయినా సారంగదారియా సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలవడం విశేషం.. ఈ ఒక్క పాటవల్ల ఇప్పటివరకు సినిమాపై లేని అంచనాలు భారీగా పెంచాయి..ఇందులో సాయి పల్లవి డాన్స్ కి అందరు ఫిదా అవుతున్నారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినిమాకోసం ఎదురు చూస్తున్నారు..
ఇకపోతే నాగ చైతన్య కి కూడా ఈ సినిమా ఎంతో ముఖ్యం ఎందుకంటే అయన గత చిత్రాలు ఎంతో నిరాశ పరచగా ఈ సినిమా తో మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. దాంతో ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యమైంది.. అక్కినేని అభిమానులకు ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలే ఉన్నాయి.. ఫిదా లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేస్తుండగా సాయి పల్లవి కూడా నటిస్తుండడం ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి కారణం..
ఇకపోతే నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే నాగచైతన్య మొదటిసారి బాలీవుడ్ సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది కూడా స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రలో చైతన్యకు ఛాన్స్ ఇచ్చినట్లు ట్తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మెరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. ఇక లవ్ స్టొరీ అనంతరం థాంక్యు సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.



























