ఫిదా మూవీ ద్వారా అందరినీ తన నటనకు ఫిదా అయ్యేలా చేసుకొని, అదిరిపోయే నటనతో దూసుకుపోతున్న నటి సాయి పల్లవి. తమిళ నాడు రాష్ట్రంలో జన్మించిన సాయి పల్లవి, అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. సాయిపల్లవికి ఒక చెల్లెలు ఉంది. తన పేరు పూజ. సాయిపల్లవి, పూజ కవల పిల్లలు. సాయిపల్లవికి చిన్నతనం నుండే డాన్స్ అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లోనే సాయిపల్లవి డాన్స్ స్టేజి షోలు చేయడం జరిగేది. అలా సాయిపల్లవి స్టేజి షో చూసిన డైరెక్టర్ ఆమెకు 8 సంవత్సరాల వయసులో ఒన చిన్న పాత్రకి అవకాశం ఇచ్చారు. అలా చదువుకునే రోజుల్లోనే సాయిపల్లవి సినిమాలో నటించడం ప్రారంబించింది.
ఆ తర్వత ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో తమిళ సినిమాలో హీరోయిన్ చేసే అవకాశం రావడంతో తన మొదటి సినీమా ప్రారంభం అయ్యింది. తమిళ్ లో సాయిపల్లవి నటించిన సినీమా పెద్ద హిట్ అయ్యింది. అంతే కాకుండా ఆ తర్వాత సాయి పల్లవి డాన్స్ షో లో కూడా పార్టిసిపేట్ చేసేది. కానీ సాయిపల్లవి తండ్రికి మాత్రం ఆమె సినీమాలో చేయడం ఇష్టం ఉండేది కాదు. ఆ కారణం చేత సాయి పల్లవి తండ్రి ఆమెను మెడిసిన్ చదవడం కోసం జార్జియా దేశానికి పంపడం జరిగింది.
4 సంవత్సరాలు మెడిసిన్ పూర్తి చేసుకొని తిరిగి ఇండియాకి వచ్చిన సాయిపల్లవి సినీమాలు చేస్తూ, అలాగే తెలుగు ఢీ డాన్స్ షోకి కూడా కాంటెస్ట్ గా రావడం జరిగింది. అలా కొన్ని రోజులు సినీమాలు చేస్తునే సర్జన్ గా చేయడానికి మళ్లీ జార్జియా దేశం వెళ్లిపోయింది. సెలవలకు ఇండియా వచ్చిన సాయి పల్లవి ని దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా మూవీ లో హీరోయిన్ తీసుకోవడం జరిగింది. ఆ సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయిపోయారు.. తెలంగాణ భాషతో అందర్నీ ఆకట్టుకుంది. ఎంతో నాచురల్గా కనపడే ఈ నటి చిత్రసీమాలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటూ ఉంది. మేకప్ లేకుండా నటించేందుకు వీలైనంత వరకు ఓటు వేస్తుంది.
ఇవ్వన్నీ కలిపి ఆమెకు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాయి. ఫోర్బు ఇండియా తాజాగా ప్రకటించిన అండర్ 30 జాబితాలో గుర్తింపు పొందింది. భారతీయ యువతి ఎక్కువ విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ జాబితాలో ప్రకటిస్తాయి. ఎంట్టైన్మెంట్ విభాగంలో సాయి పల్లవి కి స్థానం లభించింది గ్రేట్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…