పెళ్లి అంటేనే ఇరు కుటుంబాలకు సమఉజ్జి ఉండాలి అంటారు. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా. ఆలా లేకపోతే అవి నిలబడటం కష్టం అని చాల మంది అంటూ ఉంటారు. వారి జీవితాల్లో జీవించే విధానాల్లో అనేక వ్యత్యాసాలు ఉంటె ఆలా చేసుకునే పెళ్ళిళ్ళల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరి హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ లక్షల్లో డబ్బు సంపాదిస్తూ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తూ ఒక చిన్న సాదా సీదా సీరియల్ హీరోతో ప్రేమలో పడితే ఆ ప్రేమ నిలుస్తుందా పెళ్లి దాకా వెళ్తుందా ఒక వేళ వెళ్లిన ఆ పెళ్లి తరువాత వారి జీవితం ఎలా ఉంటుంది, ఆ హీరోయిన్స్ మరియు సీరియల్ హీరోస్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
మొదటగా నటి సీత. ఈమె జీవితం గురించి ఇప్పటికే మనం చాలా ఆర్టికల్స్ చూసాం. ఆమె పెళ్లిళ్ల గురించి కూడా అందరికి తెలిసిందే. పార్తీబన్ లాంటి మహా నటుడు, దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుంది. కానీ పిల్లలను కూడా అతడికే వదిలేసి ఒంటరిగా ఉంటూ మళ్ళీ నటించడం మొదలు పెట్టింది, సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేసింది అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఆలా ఒక సీరియల్ షూటింగ్ సెట్లో ముక్కు మొహం తెలియని ఒక చిన్న నటుడితో చనువు పెంచుకుంది.. అక్కడితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకుంది.. కానీ సీత లాంటి గొప్ప నటి ముందు ఆ నటుడు ఎందుకు సరిపోలేదు.. ఈ క్రమంలో గొడవలు రావడం విడాకులు తీసుకోవడం రెండు జరిగిపోయాయి.
కానీ ఇలా అందరి జీవితాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే అందుకు ఉదాహరణ ఇంద్రజ.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. సినిమాలు తగ్గుతున్న క్రమంలో సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒక సీరియల్ షూటింగ్ లో ఉన్న సమయంలో చిన్న నటుడు అయినా మహమ్మద్ అబ్సర్ అనే ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడింది. వీరి ప్రేమ త్వరగానే పెళ్ళికి దారి తీసింది. 2005లో వీరి పెళ్లి జరిగి వీరికి ఒక పాప కూడా ఉంది. అయినా కూడా వీరు ఎంతో అన్యోన్యగా కాపురం చేస్తున్నారు.
ఇక ఇదే దోవలో మరొక హీరోయిన్ మరియు క్యారెక్టర్ నటి దేవదర్శిని. లారెన్స్ కాంచన సినిమాలతో తెలుగు లో కూడా ఎంతో పాపులర్ అయినా ఈ నటి తెలుగు లో డబ్బింగ్ చేయబడిన మర్మదేశం సీరియల్ లో నటిస్తున్న సమయం లో ఆ సీరియల్ హీరో అయిన నటుడు చేతన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. దేవదర్శిని కూతురు నియాతికి ఇప్పుడు పదిహేనేళ్ళు. ఈ అమ్మాయి తమిళ్ లో 96 సినిమాలో తొలిసారిగా నటించింది. ఈ సినిమా తెలుగు లో జాను పేరుతో విడుదల అయ్యింది.
ఇక మరొక హీరోయిన్ బిపాసా బసు. బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ అయినా బిపాసా అందం లోను, ఆస్తిలోను, పేరు లోను తనతో ఏ మాత్రం సరితూగని కరణ్ సింగ్ గ్రోవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2016 లో జరగగా కరణ్ కి ఇప్పటికే రెండు సార్లు పెళ్ళై విడాకులు అయ్యింది. బిపాసాను మూడోసారి వివాహం చేసుకోగా ఆమెకు ఇది తొలి వివాహం. గత నాలుగేళ్లుగా వీరు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.
సో ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నది… ప్రేమకు పెళ్లికి… డబ్బు, హోదా, పరువు, వ్యత్యాసాలతో పని లేదు. మనసులు కలిస్తే ఆ కాపురం కలకాలం సాఫీగానే సాగుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…