రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళనల నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీచేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణాలో తోలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో సిద్దలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. మురికివాడల్లోని ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. ప్రధాన బస్సు స్టాండులు, రైల్వేస్టేషన్లలో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.
కరోనా వైరస్ మురికివాడల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో మురికి వాడల్లో ఎక్కువగా దృష్టి సారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ఐపియమ్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ హాజరై కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను న్యాస్థానానికి వివరించారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ప్రస్తుతం గాంధీ, టిబి, ఫీవర్, ఛాతి ఆసుపత్రిలలో కరోనా చికిత్సకు తగిన ఏర్పాట్లు చేశామని కోర్టుకు వివరించారు. వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా పర్సనల్ ప్రివెంటివ్ ఎక్విప్ మెంట్ అందచేసినట్టు తెలిపారు.
మరో పక్క కరోనా ఆందోళన వాతావారణాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు కొందరు వ్యాపారాలు. మాస్కుల ధరలను భారీగా పెంచేశారు. మొన్నటివరకు రూ.1.60 లకు అమ్మిన మాస్క్ లను ఇప్పుడు 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఎన్ – 95 మాస్క్ లను ఏకంగా 500 వందలకు అమ్ముతున్నారు. ఇక శానిటైజర్లు అసలు దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ దొరికినా ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ దృష్ట్యా భారీగా రేట్లు పెంచి అమ్ముతున్నారు. ప్రజలలో కరోనా భయాన్ని భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వత్రా హర్షం వక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…