Fight master Vijayan : అత్యంత చిన్నవయసులోనే స్టంట్ మాస్టర్ గా మారి ఫైట్ మాస్టర్ గా పేరు తెచ్చికున్న వ్యక్తి విజయన్ మాస్టర్. తండ్రి స్వామినాథన్ కూడా ఫైట్ మాస్టర్ గా ఉండటం అదికూడా ఎక్కువగా ఏంజీఆర్ సినిమాలకు పనిచేయడం వల్ల విజయన్ కి కూడా ఏంజీఆర్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఇక కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న వయసులోనే విజయన్ మాస్టర్ సినిమాల్లోకి వచ్చారు. అలా ఎన్నో సినిమాలకు పనిచేసిన విజయన్ మాస్టర్ తాను పనిచేసిన హీరోల్లో డూప్ లేకుండా నటించిన హీరోల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ హీరోలు డూప్ వాడరు.. నా మీద నమ్మకం…
తమిళం, తెలుగు, కన్నడ, హిందీ ఎలా అన్నిభాషలలోనూ అందరి హీరోలతో పనిచేసిన విజయన్ గారు ఎవరు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడతారో వివరించారు. ముఖ్యంగా తమలంలో కమల్ హాసన్ నేర్చుకుని చేయడానికి ఇష్టపడుతాడని, ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ చూపించండి నాకు వస్తే నేను చేస్తా లేదంటే నాకొచ్చేలాంటి యాక్షన్ సీన్ పెట్టండి అంటూ చెప్పేవారట. ఇక చిరు కూడా డూప్ ఇష్టపడంటూ చెప్పిన ఆయన మహేష్ సీన్ వివరించాక సరే అనేస్తాడు పక్కన ఉన్నవాళ్లు డూప్ వాడండి అని చెప్పినా ఐదంతస్థుల మీద నుండి దూకే సీన్ అయినా సరే టెన్షన్ పడడు.
పక్కన వాళ్ళు భయపడినా మాస్టర్ చూసుకుంటారు ఎందుకు టెన్షన్ అని నవ్వేస్తాడు అంటూ చెప్పారు. విజయన్ మాస్టర్ దాదాపు ఆయన చేసిన సినిమాల్లో డూప్ వాడకుండా హీరోలతోనే చేయిస్తారట. ఇక మహేష్ బాబు కి ‘రాజకుమారుడు’ సినిమాకు ముందే గుర్రపు స్వారీ, కత్తి సాము, కర్ర సాము వంటి వాటిలో శిక్షణ నేనే ఇచ్చానంటూ చెప్పారు. అలా తనకు నా మీద చాలా నమ్మకం అంటూ తెలిపారు. ‘టక్కరి దొంగ’ సినిమా టైములో పెద్ద వాటర్ ఫాల్ నుండి కిందికి దిగాలి అలాంటి సీన్ కూడా డూప్ లేకుండా చేసాడు మహేష్ అంటూ చెప్పారు విజయన్ మాస్టర్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…