Actress Vaishnavi: గత ఏడాది ఎంతోమంది బుల్లితెర వెండితెర నటీమణులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కొందరు ఇప్పటికే అమ్మలుగా ప్రమోట్ కాగా మరికొందరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇకపోతే బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బుల్లితెర నటి వైష్ణవి రామిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే.
స్టార్ మాలో ప్రసారమవుతున్న దేవత సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించిన వైష్ణవి ఈ సీరియల్ మధ్యలోనే సీరియల్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక వైష్ణవి గత ఏడాది సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా వీరి వివాహానికి సంబంధించిన వీడియోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకే వైష్ణవి తల్లి కాబోతున్నాననే విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.ఇలా తన ప్రేగ్నెన్సీ గురించి పలుమార్లు వెల్లడించిన వైష్ణవి తాజాగా సీమంతపు వేడుకలను ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈమెకు నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా సీమంతపు వేడుకలను జరిపారు.ఈ క్రమంలోనే తన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను వైష్ణవి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొద్ది రోజులలోనే వైష్ణవి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…