Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 17 సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పలు వివాదాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు.
ఇలా వరుస వివాదాలతో తరచూ వార్తల్లో ఉండే రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఇది ఎలా సాధ్యం అని యాంకర్ రష్మికను ప్రశ్నించడంతో ఈమె సమాధానం చెబుతూ తాను చిన్నప్పటి నుంచీ చిరునవ్వుతో జీవించడం నేర్చుకున్నానని తెలియజేశారు.
చిన్నప్పుడు తాను హాస్టల్ లో ఉండి చదువుకునేదాన్ని సుమారు 800 మంది విద్యార్థులు ఉండేవారు నాకు ముఖ్యంగా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల నేను మాట్లాడే మాటలు వల్ల ఎన్నో అపార్థాలు చేసుకొని నేను చేయని తప్పుకు కూడా మాటలు పడాల్సి వచ్చేది. అలా నా తప్పు లేకుండా మాటలు పడుతున్న సమయంలో తాను ఒంటరిగా గదిలో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చానని రష్మిక తెలిపారు.
నాకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యను తన తల్లితో పంచుకోవడం అలవాటు నేను ఇప్పుడు ఇలా స్ట్రాంగ్ గా ఉన్నానంటే అందుకు కారణం అమ్మనే. ఇక ఈ ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. అలాంటప్పుడు నా సమస్యను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదని ఈ సందర్భంగా రష్మిక చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…