Actor Brahmaji: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటాయి.అయితే గత కొద్ది రోజులుగా ఏపీ మంత్రి సినీనటి రోజా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మెగా బ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సినీ సెలబ్రిటీలు రోజాకు తిరిగి తమదైన శైలిలోనే సమాధానం చెబుతూ కౌంటర్ ఇస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం రోజా మాట్లాడుతూ మెగా కాంపౌండ్ నుంచి ఆరేడు మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు వారికి ఎదురు చెప్పలేకే చిన్న చిన్న సెలబ్రిటీ లందరూ కూడా వారిపై ప్రేమ గౌరవం ఉన్నట్లు నటిస్తున్నారు తప్ప వారికి నిజమైన ప్రేమ లేదని,వారికి ఎదురు తిరిగితే ఎక్కడ అవకాశాలు రాకుండా ఉంటాయోనన్న భయం మాత్రమే ఉందంటూ కామెంట్ చేశారు.
అయితే రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఈ సందర్భంగా బ్రహ్మజీ ట్విట్టర్ వేదికగా రోజా వ్యాఖ్యలకు రీకౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మజీ స్పందిస్తూ మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కూడా నన్ను క్యాంపెయిన్ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు, నాపై ఒత్తిడి తేలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
బ్రహ్మాజీ ఇలా ట్వీట్ చేస్తూ రోజాకు కౌంటర్ ఇవ్వడంతో మెగా అభిమానులు స్పందిస్తూ ఇప్పటివరకు ఎవరు కూడా సినీ సెలెబ్రిటీలు ఇలా మద్దతు తెలుపలేదు.. మీ నుంచి ఇది అసలు ఊహించలేదన్న సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన మొట్టమొదటి వ్యక్తి మీరే థాంక్యూ అంటూ మెగా అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్లకు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…