Susmitha: పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఈ నియోజకవర్గం పైనే ఉంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భాగంగా గాజువాక భీమవరంలో పోటీ చేసి ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాపులు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈయన పోటీకి దిగారు.
ఇక ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలుపు అందుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచార కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. పిఠాపురం చేరుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మెగా హీరోలు అందరూ కూడా పిఠాపురంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
చివరికి రామ్ చరణ్ ఆయన తల్లి సురేఖ కూడా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలబడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు మెగా హీరోలందరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు కానీ మొదటిసారి మెగా డాటర్ సుస్మిత సైతం తన బాబాయిని గెలిపించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
అండగా నిలవండి…
ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అతని పోరాటం నిజమైనది.. ఆయన హృదయం ప్రజల కోసమే, అతను నిజం కోసమే నిలబడతారు దయచేసి అండగా నిలవండి అంటూ ఈమె తన బాబాయిని గెలిపించాలని కోరుతూ చేసిటువంటి ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే మొదటిసారి ఇలా మెగా డాటర్ తన బాబాయ్ గెలుపు కోసం పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…