Featured

Flash back : ఎస్పి బాలు కి హీరో కృష్ణ కి మధ్య గొడవ ఎందుకయ్యింది… శోభన్ బాబు గారు ఏమన్నారంటే…!

Flash Back : ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా అప్పటి హీరోలందరూ సినిమాలలో నటిస్తున్న సమయంలో మొదటగా హీరోలకు గాయకుడంటే ఘంటసాల గారు. ఆ తరువాత ఎస్పి బాలసుబ్రమణ్యం అనే చెప్పాలి. అతే ఎస్పి బాలు తో మొదట్లో బాగా పాటలు పడించుకున్న హీరో అంటే కృష్ణ గారనే చెప్పాలి. ఘంటసాలగారి తరువాత రామకృష్ణ గారిని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్రహీరోలు ప్రోత్సహిస్తున్న రోజుల్లో కృష్ణ గారు బాలు కి అవకాశం ఇచ్చారు. కానీ వాళ్లిద్దరి మధ్య చిన్న వివాదం వల్ల ఒక మూడేళ్లు కృష్ణ గారి సినిమాలకు పాటలు పాడలేదు బాలు గారు. అసలు వారిమధ్య జరిగిన గొడవకు కారణం కేవలం ఇతరులు మధ్యలో చెప్పిన అపద్ధాలు.

అసలు గొడవ ఏమిటి..ఎలా పరిష్కరించుకున్నారు…

రామకృష్ణ గారితో అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాడించుకోవడం వల్ల ఇక శోభన్ బాబు, కృష్ణం రాజు లు కూడా ఆయన వైపుక్ మొగ్గు చూపారు, దీంతో బాలు గారికి అవకాశాలు తగ్గాయి. ఆ సమయంలో ఒక నిర్మాత డబ్బు ఇవ్వాలి కానీ మూడేళ్ళైనా ఇవ్వలేదనే కారణంతో బాలు గారు ఫోన్ చేసి అడిగితే నేనేమైన పారిపోతానా ఇస్తానులే అంటూ దురుసుగా మాట్లాడారట. అయితే వెంటనే హీరో కృష్ణ గారు ఫోన్ చేసి నువ్వు పాడక పోతే నా సినిమాలు హిట్ కావు అని అన్నావట అని అడిగి నీ మిత్రుడితో సినిమా తీయించావు అతను నాకు ఇరవై వేలు ఇంకా ఇవ్వలేదు వెంటనే పంపు నీకు రావాల్సిన డబ్బు నేను పంపుతాను అని చెప్పేసేసరికి బాలు గారు బాధపడి వెంటనే ఆ డబ్బు పంపారట. కృష్ణగారు కూడా వెంటనే బాలు గారికి రావాల్సిన డబ్బు పంపారట. అయితే ఒక మూడేళ్లు ఇద్దరూ కలిసి మళ్ళీ పనిచేయలేదు. కానీ బయట కలిసినపుడు మామూలుగానే ఉండేవారు. ఇక వీరిద్దరూ కలిసి పనిచేయకపోవడం వల్ల మ్యూజిక్ డైరెక్టర్స్ ఇబ్బందిపడేవారు. దీంతో సుందరరాంమూర్తి గారు చొరవ చూపి వీళ్ళను కలిపే ప్రయత్నం చేయగా నేరుగా కృష్ణ గారి ఆఫీస్ కి బాలు గారే వెళ్లి నేను ఆ రోజు జరిగినది చెప్పాలని అనుకుంటున్నాను అంటే అసలేమి వినకుండా అవసరం లేదు ఇద్దరం కలిసిపనిచేద్దాం అని చెప్పేశారట.

శోభన్ బాబు ఏమన్నారంటే…

ఇక శోభన్ బాబు గారి విషయంలోనూ జరిగిన ఒక విషయంలో కూడా అప్పట్లో హీరోల సంస్కారాన్ని తెలియజేస్తుంది. రామకృష్ణ గారితో అగ్రహీరోలు పాడించుకోవడం వల్ల శోభన్ బాబు గారు కూడా ఆయనతో పాడించుకోవాలని అనుకున్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి ఒక సినిమా విషయంలో బాలు తో పాడించుకుందాం అని అడిగినా శోభన్ బాబు లేదు వద్దు అని చెప్పారట. ఇక ఆ సినిమాలో రామకృష్ణతో పాడించుకున్నా బయట కనిపించినపుడు బాలుగారికి శోభన్ బాబు గారు ఎందుకు పాడించుకోవాల్సి వచ్చిందో వివరించారట. మీరెందుకు వివరించాలి అవసరం లేదు మీకు నచ్చినవారితో పాడించుకోవచ్చు అని చెప్పినా ఆయన లేదు నాకు ఎక్కడో అది బాధగా ఉంది అందుకే నీకు చెప్పాను అంటూ బాలుగారికి వివరించారట.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago