Kalpika Ganesh: కల్పికా గణేష్ పరిచయం అవసరం లేని పేరు.గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నటువంటి ఈమె తాజాగా యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సమంతతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో నటించిన కల్పిక తాజాగా సమంత నటించిన యశోద సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమా విడుదల అనంతరం పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఈమె వార్తలలో నిలిచారు . ఇకపోతే తనకు సమంత లాగే మయోసైటిసిస్ వ్యాధి ఉందంటూ అందరికీ షాక్ ఇచ్చారు. సమంత థర్డ్ స్టేజ్లో ఉండగా తాను ఫస్ట్ స్టేజ్ లో ఉన్నానంటూ తన గురించి వెల్లడించారు. యశోద సినిమా అనంతరం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేసిన కల్పిక ఉన్నఫలంగా ఆసుపత్రి పాలయ్యారు.
ఈ విధంగా ఈమె హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆందోళన చెందారు. ఇక కల్పిక గత కొంతకాలం నుంచి వెన్నెముక వద్ద తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఈ నొప్పి కారణంగా ఎక్కువ సేపు నిలబడలేకపోవడం అలాగే కూర్చోలేకపోవడం ఇబ్బందులు తలెత్తాయని ఈమె వెల్లడించారు.
ఇలా వెన్నునొప్పి కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి కల్పికాకు వైద్యులు సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈమెకు జరిగిన సర్జరీని లుంబార్ రాడిక్యులోపతి అని అంటారు.సర్జరీ జరిగిన అనంతరం కల్పిక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘చివరికి అంతా సవ్యంగా జరిగింది.. నా పోరాటం చివరికి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి’ అంటూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…