Featured

Flash Back : 90s లో “పోలీస్” గా వచ్చిన ఈ నలుగురు హీరోల్లో ఒకరు మాత్రమే బాక్సాఫీస్ వద్ద లాఠీ ఝుళిపించారు.!!

Flash Back : 90s లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పోలీస్ గా వివిధ రకాలైన చిత్రాల్లో కనిపించారు. ఆ చిత్రాల విజయ పరంపర ఎలా ఉందో చూద్దాం…

1991 శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రియదర్శన్ దర్శకత్వంలో నిర్ణయం చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున అమల హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్షిప్తంగా కథలోకి వెళితే..

వంశీకృష్ణ (నాగార్జున) నిజాయితీ గల రక్షక భటుడు. జైలు నుండి తప్పంచుకున్న రఘురాం (మురళిమొహన్)ను వెతుకుతూ హైదారాబాదు వచ్చి రఘురాం కూతురు అయిన గీత (అమల)తో ప్రేమలో పడి, రఘురాం అమాయకత్వం చూసి, రఘురాం పై గల case ను తిరగదొడి, శరత్ సక్సెనా తన స్నేహితుడైన శుభలేఖ సుధాకర్ ను చంపాడని తెలుసుకోని, స్టెడియంలో బాంబు వుంది అని గందరగొళం సృష్టించి, రఘురాం చేతిలో చనిపొయెలా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథాంశం.

ఇక పోతే 1992లో పోలీస్ పాత్రలో బాలకృష్ణ దూసుకు వచ్చారు. టి.త్రివిక్రమరావు నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో “రౌడీఇన్స్పెక్టర్” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. లోగడ బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన “లారీడ్రైవర్” చిత్రం విజయవంతం కాగా మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం రూపుదిద్దుకుంది. పవర్ ఫుల్ పోలీస్ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ ఇరగదీశారు. పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు బాలయ్యబాబు పలికిన తీరు ఆయన అభిమానులను హోరెత్తించాయి. బప్పీలహరి అందించిన పాటలు రౌడీఇన్స్పెక్టర్ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

1994 సురేష్ ప్రొడక్షన్స్,డి సురేష్ నిర్మాణం, కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో “సూపర్ పోలీస్” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, నగ్మా, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించారు…. సంక్షిప్తంగా కథలోకి వెళితే…. విజయ్ ( వెంకటేష్ ) నిజాయితీగల పోలీసు ఇన్స్పెక్టర్. అతని గత ప్రేయసి భారతి ( సౌందర్య ) అనే జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఆ రోజు నుండి, అతను తాగుబోతు అయ్యాడు. విజయ్ ఒక జర్నలిస్ట్ రేణుక ( జయసుధ ) ఇంటికి అద్దెకు వస్తాడు, ఆమె తన భర్త ఎస్.పి.ప్రకాష్ ( అహుతి ప్రసాద్ ) నుండి, అతడి అనైతిక ప్రవర్తన కారణంగా, విడాకులు తీసుకుని,, ఆమె ముగ్గురు పిల్లలతో నివసిస్తూంటుంది. విజయ్ రేణుక కుటుంబానికి దగ్గరగా వచ్చి ఆమె పిల్లలతో అనుబంధాన్ని పెంచుకుంటాడు… ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథాంశం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఎస్.పి.పరశురాం” చిత్రం రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994 లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, శ్రీదేవి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను అల్లు అరవింద్, జి. కె రెడ్డి, ముకేష్ ఉదేషి నిర్మించారు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. తెలుగులో కథానాయికగా శ్రీదేవికిది చివరి సినిమా.

ఎస్.పి.పరశురాం విధినిర్వహణ పట్ల కఠినంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి. అతని తమ్ముడు నీలి చిత్రాల కేసులో పట్టు పడితే అతన్ని అరెస్టు చేయడానికి వెనుకాడడు. ఈ నేరంలో రాణి అనే చిన్న దొంగ కూడా బాధితురాలు అవుతుంది. ఆమె తప్పించుకుంటుంది కానీ సాక్షిగా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆమె సాక్షిగా ఉండటం వలన గూండాలు ఆమె మీద దాడి చేస్తారు. ఆ దాడిలో ఆమె చూపు కోల్పోతుంది. జరిగిన అన్యాయం పై హీరో ఏ విధంగా తిరగబడతారు అనేదే మిగతా కథాంశం…. నిర్ణయం, రౌడీ ఇన్స్పెక్టర్, సూపర్ పోలీస్, ఎస్పి పరశురాం.. లాంటి చిత్రాలతో ఈ నలుగురు స్టార్స్ బాక్స్ ఆఫీస్ వద్ద లాఠీ లేవనెత్తగా పోలీస్ గా ఒక్క బాలయ్యే లాఠీని ఝులిపించగలిగారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

5 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

5 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

7 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

7 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

9 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

9 hours ago