Featured

Kajal Aggarwal : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్… ఆనందంలో కుటుంబ సభ్యులు…!

Kajal and Gowtham kichlu blessed with baby boy : టాలీవుడ్ చందమామ, పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30న వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. కరోనా లాక్ డౌన్ వల్ల అత్యంత సన్నిహితులు బంధువుల నడుమ పెళ్లి జరిగింది. ఇక ఆ తర్వాత కాజల్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. పెళ్లి తర్వాత కొన్నిరోజులకే కాజల్ తల్లికాబోతోంది అంటూ వార్తలోచ్చిన ఈ ఏడాది జనవరిలో తాను తల్లి కాబోతున్నట్లు కాజల్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఇక ఈ రోజు ఆమెకు డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారని సమాచారం. అయితే బిడ్డ జన్మించిన విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ, పలువురు సినిమా తారలు కాజల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ ఈ విషయం గురించి ఉదయాన్నే ఒక హింట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఉదయాన్నే శుభవార్త కోసం ఎదురుచూస్తున్న అంటూ పోస్ట్ పెట్టి హింట్ ఇచ్చింది.

ప్రెగ్నెంట్ అయిన తర్వాత మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ, ఇక ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో చేయాల్సిన వ్యాయామాలను కాజల్ అగర్వాల్ వీడియోలు షేర్ చేశారు. తనపై బాడీ షేమింగ్ విమర్శల పట్ల కూడా స్పందించారు. గర్భం దాల్చిన సమయంలో మహిళలు ధైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారా చెప్పారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

17 minutes ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

17 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

17 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

19 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

19 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

21 hours ago