Flash Back : “ఘరానా” టైటిల్ తో వచ్చిన రాఘవేంద్రరావు మూడు చిత్రాలలో ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. !!

“ఘరానా దొంగ “1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

ఈ చిత్రం 1980 మార్చి 29 న మద్రాసులోని సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయం నుండి యు సర్టిఫికేట్ అందుకుంది; సర్టిఫికేట్ 27 మార్చి 1980 నాటిది.భలే కృష్ణుడు తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు కృష్ణతో కలిసి పనిచేసిన రెండవ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

“ఘరానా మొగుడు” 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి,నగ్మా‌ ముఖ్యపాత్రలు పోషించారు.10 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా ఈ సినిమాకు గుర్తింపు ఉంది. ఇందులో డిస్కోశాంతి, చిరంజీవిలపై చిత్రించిన “బంగారు కోడిపెట్ట” పాట బాగా హిట్టయిన చిరంజీవి డాన్స్ పాటలలో ఒకటి. కన్నడంలో విజయవంతమైన “అనురాగ అరళితు” అనే సినిమాకు ఈ సినిమా తెలుగు పునర్నిర్మాణం. కథలోకి వెళితే…

విశాఖపట్టణం పోర్టులో పని చేస్తున్న రాజు (చిరంజీవి) తోటి ఉద్యోగులకి సహాయపడుతూ అందరి మెప్పు పొందుతుంటాడు. తన తల్లి (శుభ) కి పక్షవాతం రావటంతో హైదరాబాదుకి తిరిగివచ్చి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన పారిశ్రామికవేత్త అయిన బాపినీడు (రావు గోపాలరావు) ని రాజు రక్షిస్తాడు. అతని మంచితనాన్ని మెచ్చిన బాపినీడు తన సంస్థలోని ఒక ఉద్యోగానికి సిఫారసు పత్రాన్ని రాజుకి ఇస్తాడు. పొగరుబోతు అయిన బాపినీడు కుమార్తె ఉమాదేవి (నగ్మా) వ్యక్తిత్వం రాజుకి మొదటి నుండి నచ్చదు… అయినా ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నదే మిగతా కథ అంశం.

“ఘరానా బుల్లోడు” 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని ఇందులో ప్రధాన పాత్రధారులు.ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు.ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన ఘరానదొంగ, ఘరానా బుల్లోడు చిత్రాలు విజయవంతం కాగా.. 1992లో వచ్చిన “ఘరానా మొగుడు” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.