Featured

Naga Chaitanya: రాశి ఖన్నా తనతో ఫ్రెండ్లీగా ఉంటుంది.. తనకు అన్నీ తెలుసు.. చైతన్య కామెంట్స్ వైరల్?

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య విడాకుల తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్యూ సినిమా ద్వారా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య హీరోయిన్ రాశి ఖన్నాతో జతకట్టారు.

ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.హీరో హీరోయిన్లు ఇద్దరు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున సినిమా గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య రాశిఖన్నా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే నాగచైతన్య మాట్లాడుతూ తాను రాశి ఖన్నాతో కలిసి రెండు సినిమాలలో నటించానని తెలిపారు. షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన ఇద్దరం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడమే కాకుండా, ఒకరి ఇష్టాలను మరొకరు పంచుకుంటామని ఇలా తన గురించి రాశిఖన్నాకు బాగా తెలుసు, అలాగే తన గురించి కూడా నాకు అన్ని విషయాలు తెలుసు అంటూ నాగచైతన్య వెల్లడించారు.

రాసి ఖన్నా ఎక్కువగా మాట్లాడుతుంది…

ఇకపోతే రాశి ఖన్నా షూటింగ్ సమయంలో విరామం దొరికితే కాస్త ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారని చైతన్య ఈ సందర్భంగా తన గురించి ఓపెన్ అయ్యారు. నాగచైతన్య రాశి ఖన్నా గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇక వీటిని చూస్తుంటే నాగచైతన్య థాంక్యూ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటారని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశిఖన్నాతో పాటు మాళవిక నాయర్ అవికాగోర్ కూడా నటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

5 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

5 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

7 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

7 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

8 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

9 hours ago