Featured

Actor Danush: ఆటో డ్రైవర్ లా ఉన్నానని హేళన చేశారు.. అవమానాలను తలుచుకొని ఎమోషనల్ అయిన హీరో ధనుష్?

Actor Danush: కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరో ధనుష్. ధనుష్ హీరోగా 2002లో ‘తుళ్లువాదో ఇలమై’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2003లో హీరోగా ‘కాదల్‌ కొందెన్‌ సినిమాలో నటించారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క హీరో హీరోయిన్లు కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈయన కూడా తన కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తనని చూసి చాలామంది హేళన చేస్తూ నవ్వారని ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ధనుష్ తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ విధంగా తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ ది గ్రేట్ మాన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తన కెరియర్ మొదటి రోజులను గుర్తు చేసుకుని బాధపడ్డారు.

ఈ క్రమంలోనే 2003వ సంవత్సరంలో కాదల్‌ కొందెన్‌ సినిమా షూటింగ్ సమయంలో తాను కాస్త నలుపు రంగులోను బక్క పలుచగా ఉండేవాడిని. అయితే ఆ సమయంలో కొందరు నా దగ్గరకు వచ్చి ఇక్కడ హీరో ఎవరు అని అడిగారు. నేనే హీరో అని చెబితే అవమానంగా ఉంటుందేమోనని పక్కవారిని చూపించాను.అయితే చివరికి వాళ్లు నేనే హీరో అని తెలుసుకొని ఆటో డ్రైవర్ లా ఉన్నాడు వీడు హీరో ఏంటి అంటూ హేళన చేసి నవ్వారని ధనుష్ వెల్లడించారు.

వీడు హీరో ఏంటి అని హేళన చేశారు…

ఈ విధంగా అందరూ వీడు హీరో ఏంటి అని హేళన చేయడంతో ఎంతో బాధేసిందని ఆ క్షణమే కారులోకి వెళ్లి కూర్చుని బాగా ఏడ్చానని ధనుష్ పేర్కొన్నారు. అయితే కొంతసేపటికి తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఆటో డ్రైవర్ అయితే హీరో కాకూడదా? అని ధైర్యం చెప్పుకొని సినిమాలలో నటించానని ఈ సందర్భంగా ఈయన కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న చేదు సంఘటనలను అవమానాలను బయటపెట్టారు. ఇలా ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago