Actor Danush: కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరో ధనుష్. ధనుష్ హీరోగా 2002లో ‘తుళ్లువాదో ఇలమై’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2003లో హీరోగా ‘కాదల్ కొందెన్ సినిమాలో నటించారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క హీరో హీరోయిన్లు కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈయన కూడా తన కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తనని చూసి చాలామంది హేళన చేస్తూ నవ్వారని ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ధనుష్ తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ విధంగా తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ ది గ్రేట్ మాన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తన కెరియర్ మొదటి రోజులను గుర్తు చేసుకుని బాధపడ్డారు.

ఈ క్రమంలోనే 2003వ సంవత్సరంలో కాదల్ కొందెన్ సినిమా షూటింగ్ సమయంలో తాను కాస్త నలుపు రంగులోను బక్క పలుచగా ఉండేవాడిని. అయితే ఆ సమయంలో కొందరు నా దగ్గరకు వచ్చి ఇక్కడ హీరో ఎవరు అని అడిగారు. నేనే హీరో అని చెబితే అవమానంగా ఉంటుందేమోనని పక్కవారిని చూపించాను.అయితే చివరికి వాళ్లు నేనే హీరో అని తెలుసుకొని ఆటో డ్రైవర్ లా ఉన్నాడు వీడు హీరో ఏంటి అంటూ హేళన చేసి నవ్వారని ధనుష్ వెల్లడించారు.
వీడు హీరో ఏంటి అని హేళన చేశారు…
ఈ విధంగా అందరూ వీడు హీరో ఏంటి అని హేళన చేయడంతో ఎంతో బాధేసిందని ఆ క్షణమే కారులోకి వెళ్లి కూర్చుని బాగా ఏడ్చానని ధనుష్ పేర్కొన్నారు. అయితే కొంతసేపటికి తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఆటో డ్రైవర్ అయితే హీరో కాకూడదా? అని ధైర్యం చెప్పుకొని సినిమాలలో నటించానని ఈ సందర్భంగా ఈయన కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న చేదు సంఘటనలను అవమానాలను బయటపెట్టారు. ఇలా ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.































