Flash Back : శంకరాభరణం, రాధాకళ్యాణం, శుభోదయం చిత్రాల అనంతరం చంద్రమోహన్ రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన ఒక చిత్రంలో నటించారు. తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న విజయశాంతి తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. అలా చంద్రమోహన్ విజయశాంతి కాంబినేషన్లో ఒక చిత్రం విడుదల అయింది. సారథి స్టూడియోస్, సాంబశివరావు దర్శకత్వంలో “పెళ్లిచూపులు” చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి హీరో, హీరోయిన్ గా నటించారు.
” పెళ్ళి చూపులు” తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ నాయికా నాయకులుగా నటించారు.
ప్రధాన పాత్రలైన ప్రశాంత్ (విజయ్ దేవరకొండ), చిత్ర (రీతు వర్మ) పెళ్ళిచూపుల్లో కలవడంతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రశాంత్ ఇంజనీరింగ్ చదువుకున్నా బద్ధకంతోనూ, జీవితంలో ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతోనూ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటాడు. షెఫ్ (chef)గా కెరీర్ ప్రారంభించి ఓ రెస్టారెంట్ ప్రారంభించాలన్నది అతని కల.
చిత్ర చాలా స్పష్టత ఉన్న అమ్మాయి, జీవితంలో ఏం సాధించాలన్న దానిపై సుస్పష్టమైన దృష్టితో తన కలలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఐతే ఆమె ఓ అబ్బాయితో ప్రేమలో పడి, అతనితో కలిసి రెస్టారెంట్ ఆన్ వీల్స్ (ఫుడ్ ట్రక్) ప్రారంభించి తన కల నెరవేర్చుకుందామని ఆశిస్తుంది. ఆ తర్వాత సినిమా అనేక మలుపులు తిరిగి ముగుస్తుంది. ఈ రెండు చిత్రాలు (చంద్రమోహన్, విజయశాంతితో నటించిన పెళ్లిచూపులు, విజయ్ దేవరకొండ, రీతువర్మతో నటించిన పెళ్లిచూపులు) ప్రేక్షకుల అభిమానాన్ని చురగొని, విజయవంతంగా ప్రదర్శింపబడ్డాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…