Featured

Flash Back : ఆ ఏడాది ఈ స్టార్ హీరోలందరికీ రెండేసి ఫ్లాప్ సినిమాలు పడ్డాయి.!!

Flash Back : 1980, 1990’s నాటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. కానీ 1987లో కొన్ని ఫ్లాప్ చిత్రాలను చవిచూడాల్సి వచ్చింది.

అవి చిరంజీవి నటించిన ఆ రెండు ఫ్లాప్ చిత్రాలు..

1) “జేబుదొంగ” ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు నిర్మించారు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. గొల్లపూడి మారుతీరావు ఈ చిత్రానికి కథ అందించాడు. పి. సత్యానంద్ మాటలు రాశాడు.

2)”ఆరాధన” భారతీరాజా దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, సుహాసిని, రాధిక, రాజశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం కడలోర్ కవిదైగళ్ అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు.

బాలకృష్ణ నటించిన ఆ రెండు ఫ్లాప్ చిత్రాలు.
1)”సాహస సామ్రాట్” 1987 లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం, దీనిని దేవి కమల్ మూవీస్ పతాకంపై కెసి శేఖర్ బాబు నిర్మించాడు. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

2)”అల్లరి కృష్ణయ్య “1987 లో తెలుగు చిత్రం. దీనిని సిహెచ్ సత్యనారాయణ, ఎస్. భాస్కర్ వనితా ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. దీనికి నందమూరి రమేష్ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, భానుప్రియ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

నాగార్జున నటించిన ఆ రెండు ఫ్లాప్ చిత్రాలు.
1)”సంకీర్తన” కోణార్క్ మూవీ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగార్జున,రమ్యకృష్ణ,శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా గీతాకృష్ణ దర్శకత్వం వహించిన 1987నాటి తెలుగు చలన చిత్రం.

2)”అగ్ని పుత్రుడు” 1987లో విడుదలైన తెలుగు సినిమా. అన్నపూర్ణా స్టుడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, శారద, రజని, శివాజీ గణేషన్ ముఖ్య పాత్రలుగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి దర్శకత్వం వహించాడు.

వెంకటేష్ నటించిన ఆ రెండు ఫ్లాప్ చిత్రాలు.
1)”భారతంలో అర్జునుడు” 1987 లో వచ్చిన సినిమా. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, ప్రకాష్ స్టూడియోస్ పతాకంపై కెఎస్ ప్రకాశరావు నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించాడు. వెంకటేష్, కుష్బూ ముఖ్యపాత్రల్లో నటించారు.ఇది హిందీ చిత్రం అర్జున్ కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.

2)”విజేత విక్రమ్” 1987 లో వచ్చిన చిత్రం. ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో టి. తిరుపతి రెడ్డి నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఫరా ప్రధాన పాత్రల్లో నటించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

15 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago