Movie News

Nookaraju : మళ్ళీ మనం వీడిపోయే రోజు రావొద్దు అంటూ కాళ్ళు పట్టుకున్న నూకరాజు… శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎమోషనల్ సీన్..!

Nookaraju : ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ఎంత పాపులర్ అయ్యిందో ఈటీవీ ప్లస్ లో వచ్చే పటాస్ స్టాండ్ అప్ కామెడీ షో కూడా అంతే ఫేమస్ అయింది. ఫైమా, ప్రవీణ్, నూకరాజు, ఆసియా వంటివారికి మంచి గుర్తింపునిచ్చింది. అయితే పటాస్ ఆగిపోయాక కొంతమంది జబర్దస్త్ కి రాగా మరి కొంత మంది కనుమరుగయ్యారు. ఇక పటాస్ షో సమయంలోనే ఫైమా, ప్రవీణ్ మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఆ ప్రోగ్రామ్ అప్పుడే ఆసియా, నూకరాజు మధ్య కూడా ప్రేమ చిగురించినా ఎవరికీ తెలియదు.

ఆసియా కాళ్ళు పట్టుకున్న నూకరాజు…

శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా జబర్దస్త్ కమెడియన్స్ స్కిట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక నూకరాజు, ఆసియా, శాంతి కుమార్ లు కలిసి స్కిట్స్ చేసారు. ఈ స్కిట్స్ లో ప్రేమ, పరువు హత్య కాన్సెప్ట్ తో అందరిని ఎమోషనల్ చేసారు. నిజంగా ప్రేమికులే అన్నట్టుగా నటించారు నూకరాజు, ఆసియా. ఇక స్కిట్ అయ్యాక రామ్ ప్రసాద్ నిజంగా ప్రేమికుల లాగా చేసారు అనగా, ఆది నిజంగా ప్రేమికులు ఏంటి నిజమైన ప్రేమికులే చెప్పలేదా అంటూ నూకరాజు ను చూసి అంటాడు. చెబితే అందరూ నవ్వుతారని చెప్పలేదు అని నూకరాజు అంటే ఆది, రామ్ ప్రసాద్ ఇద్దరు చెప్పు పర్వాలేదు అంటారు. ఇక నూకరాజు చేతిలో ఉన్న మైకుని ఆసియాకి ఇచ్చి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతాడు.

అక్కడ చూస్తున్న అందరూ షాక్ అవ్వగా, నూకరాజు మాట్లాడుతూ మళ్ళీ మనం వీడిపోయి దూరం అయ్యే రోజు రాకూడదని కోరుకుంటున్నాను అని, నాకోసం ఆసియా అన్ని వదిలేసుకుంది అంటూ ఎమోషనల్ అవుతాడు నూకరాజు. ఇక ఆసియా కూడా ఎమోషనల్ అయిపోయింది. మళ్ళీ నువ్విలా నా కాళ్ళు పట్టుకునే రోజు రాకూడదని, మన మధ్య గొడవ జరగకూడదని కోరుకుంటున్నాను అని చెబుతుంది. ఇక నూకరాజు ఎమోషనల్ గా ఆసియా అంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే స్టేజి మీద చేసేసుకుంటా అంటూ వాళ్ళ ప్రేమను అందరికి చెప్పి ఎమోషనల్ అయ్యారు.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

1 minute ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

9 minutes ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

18 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

54 minutes ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

3 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago