చేతిలో వీడియో కెమెరా ఉంది కదా.. ఏమైనా చేయోచ్చు అనే ఆలోచనలో ఉంటే ఇలానే బెడిసి కొడుతుంది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెబుతారు. అదేంటంటే.. ‘పులిని దూరం నుంచి చూడాలని అనిపించిందనుకో చూడొచ్చు.. అదే ఫొటో దిగాలని అనిపిస్తే.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు.. కానీ పులితో ఆడుకోవాలని చూస్తే మాత్రం వేటాడేస్తది’ అంటాడు.
డిట్టో ఇక్కడ అదే జరిగింది. నీటిలో ఓ క్రొకోడైల్ ను అతడు గమనించి దగ్గరగా వెళ్లి అతడు వీడియో తీయాలనుకున్నాడు. దగ్గరకు వెళ్తే ఏమైనా ఉందా.. లాగి పట్టి తినేస్తుంది. అలా కాకుండా అతడు ఓ ఉపాయం ఆలోచించారు. దాని దగ్గరకకు ఓ డ్రోన్ కెమెరాను పంపించాడు. దీంతో ఆ ముసలి ఆ డ్రోన్ ఏదో పక్షి అనుకుంది. తన వైపే చూస్తూ.. గాలిలో ఎగురుతుండగా.. తనకు ఏదో ఆపద వచ్చిందని భావించింది.
చూసింది.. చూసింది.. ఒక్కసారిగా ఎగిరి నోటి ద్వారా ఆ డ్రోన్ ను పట్టేసింది. దీంతో కసకస నమిలింది. ఇలా నములుతున్న సమయంలో దాని నోట్లో నుంచి పొగలు వచ్చాయి. అయినా దానిని వదలకుండా నమిలింది. ఇదంతా ఓ వ్యక్తి అక్కడే ఉండి మారో కెమెరాలో బంధించాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఆ వీడియోను ఫ్లోరిడాలో రికార్డు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన డ్రోన్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ క్రిస్ ఆండర్సన్ఈ ఫుటేజీని ముందుగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను రీట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరులేని జీవాల వద్ద ఇలాంటి ప్రయోగాలు ఆమోదయోగ్యం కాదంటూ ట్వీట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…