Focus Movie: సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఫోకస్’..!
Focus Movie: సూర్యతేజ దర్శకత్వంలో విజయ్ శంకర్ హీరోగా స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ వారు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సనిమాకు ఓ ఇంట్రెస్టింగ్ పేరు పెట్టారు. ‘ఫోకస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
మొదట్లో చాలా టైటిల్స్ వినిపించినా.. చివరకు ఫోకస్ ను ఫిక్స్ చేసేశారు. టైటిల్ పెట్టడంతోనే మా సినిమాపై ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ ఫోకస్ కూడా పడిందన్నారు మూవీ మేకర్స్. ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో.. మర్డర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మర్డర్ చుట్టూ కథ అంతా తిరుగుతుందని.. ప్రతీ సీన్ సస్పెన్స్ గా ఉంటుందని మువీ మేకర్స్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటి సహాసిని మణిరత్నం కీలక పాత్రలో నటిస్తోంది. హీరోయిన్ గా బిగ్ బాస్ 3 ఫేమ్ అషూరెడ్డి నటిస్తోంది. హీరోగా నటిస్తున్న విజయ్ శంకర్ దీనిలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. సుహాసిని జడ్జి పాత్రలో నటిస్తోంది. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా మూవీ మేకర్స్ మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ ను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఎంతో బాగా నచ్చుతుందని.. ఈ సినిమా చూసిన తర్వాత కొత్త అనుభూతి పొందుతారన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు.. విశేషాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు సూర్యతేజ తెలిపారు. వినోద్ యజమాన్య ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…