ప్రతీ మనిషికి వ్యాధులు సోకడం అనేది సహజం. ప్రస్తుతం జీవన విధానంలో.. తినే ఆహార అలవాట్లలో మార్పుల కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. కానీ వాటిని మనం వైద్యులను సంప్రదించి వెంటనే నయం చేస్తుంటాం. కానీ అదే ప్రాణాంతక వ్యాధి బారిన పడితే మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏ వ్యాధి అయినా 90 శాతం మానవుడి నిర్లక్ష్యం కారణంగానే వస్తుంటాయని వైద్యులు చెబుతుంటారు.
కానీ ఒక పసిబిడ్డ పుట్టి పుట్టగానే రెండు వ్యాధుల బారిన పడ్డాడు. పుట్టిన నెల రోజుల సమయంలోనే, అతడికి ఒక ప్రాణాంతక జన్యువ్యాధి వచ్చింది. దానిని నయం చేసేందుకు డాక్టర్లు ఒక మెడిసిన్ ఇచ్చారు. కానీ దాని దుష్ప్రభావాల వల్ల ఆ బిడ్డకు మరో అరుదైన వింత వ్యాధి సంక్రమించింది. దీంతో ఆ బాలుడి శరీరం అంతా పొడవాటి వెంట్రుకలు పుట్టుకొచ్చాయి. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ఆ బాలుడి పుట్టిన మూడు నెలలకే ఇలాంటి వ్యాధులతో పోరాడాల్సిన పరిస్థితి రావడంతో తల్లిదండ్రులు ఆవేదన వర్ణణాతీతంగా ఉంది.
ఆ బాలుడి పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. అసలేం జరిగిందంటే.. ఆ బాలుడికి ఒక నెల వయసులో హైపర్‌ఇన్‌సులినిజం అనే అరుదైన జన్యువ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి ప్యాంక్రియాస్.. అధిక మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతాయి. ప్రతి 50 వేల మందిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. వైద్యులను సంప్రదించి చికిత్స అందించారు.
ఆ వ్యాధి తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆ బాలుడికి మరో వ్యాధి సోకింది. హైపర్-ఇన్‌సులినిజం వ్యాధి చికిత్స కోసం డయాజోక్సైడ్ మందును చిన్నారికి ఇచ్చారు. కానీ ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ తో చిన్నారి శరీరమంతటా నల్లని వెంట్రుకలు పొడవుగా పెరిగాయి. ఇలా ప్రాణాంతక వ్యాధి తగ్గేలోపే ఇలా మరో వ్యాధి సోకడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…