ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్ హస్పిటల్‌లో ఈ నెల 26న జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి అతడు చికిత్స పొందుతుండగా.. తాజాగా అతడు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. అతడి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు.
అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. ఇంటర్ తర్వాత అతడు బీఎస్సీ చదవాలని అనుకున్నా.. తర్వాత అతడు ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడట. తెలుగు భాషపై మంచి పట్టు ఉండటంతో అతడిని ఎంఏ చేయాలని సూచించడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక అతడికి మొదటి అవకాశం ఎంఏ చదువుతుండగానే వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. ఈ సినిమాతో గీతరచయితగా సీతారామ శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది.
అందుకే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. అది అతడికి ఉన్న అంకితభావం. ‘‘వాన బొట్టు ఆల్చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది..అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా’’ సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన.. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
ఇక అతడు శుభలగ్నం సినిమాలో రాసిన ‘మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయాజారాకా’ అన్న పదం ఆయన తప్ప ఇంకెవరు రాయగలరు.. అందుకే ఆయన తెలుగు సినిమా సాహిత్యాన్ని శాసించగలిగారు. భారీ పద ప్రయోగాలు బరువైన మాటలే కాదు ఆయన చిన్న చిన్న పదాలతో ఈ తరానికి అర్ధమయ్యేలా అలరించేలా కూడా పాటలు రాశారు. ఖడ్గం సినిమాలో కూడా అతడు ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు తెరకు అందించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…