Featured

చలికాలంలో ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయిపోతుంది.ఎలాంటి ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణం అయిపోతుంది.అయితే ఎక్కువగా తింటే సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అజీర్తి సమస్యలు చలికాలంలో ఎక్కువగా కలగవు.ఎలాంటి ఆహరం తిన్నా కూడా త్వరగా జీర్ణం అయి పోవడమె కాకుండా చాలా రకాల ఆహార పదార్థాల మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది.

అలాగే చలి కాలంలో పదే పదే ఆకలి కూడా వేస్తుంది. అయితే అసలు ఎందుకు ఆకలి చలికాలంలో ఎక్కువగా వేస్తుంది? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.చలికాలంలో టెంపరేచర్ అవసరం కాబట్టి ఒళ్ళు వేడిగా మారడానికి ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది. ఎనర్జీని సప్లై చేయడానికి మెటబాలిక్ రేటు పెరుగుతుంది.

దీంతో ఆకలి బాగా పెరుగుతుంది. అందుకనే చలి కాలంలో ఎక్కువ ఆహారం తీసుకుంటాము.అలాగే ఎక్కువ ఆహరం తీసుకోవడం వల్ల బరువు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే బరువు పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా ఉంటుంది.

పైగా ఫైబర్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. రాగి, ఓట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి.అలానే క్యారెట్లు, కమలాలు, పాలకూర, మెంతులు, బీట్రూట్ వంటి వాటిని డైట్లో ఎక్కువగా తీసుకోండి. ఇవి అజీర్తి సమస్యలు రాకుండా చూసుకుంటాయి. ఇలా పాటిస్తే ఒబిసిటీ కూడా రాదు.వేడి నీళ్లు తాగడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. అలానే జలుబు, ఫ్లూ వంటివి ఉండవు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago