Featured

సినీ గేయ రచయిత పద్మశ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కొడుకు కూడా సినిమా నటుడేనన్న సంగతి మీకు తెలుసా.?

పద్మశ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి పేరు వినగానే గొప్ప సినీ గేయ రచయిత మన కళ్ళ ముందు కనిపిస్తారు. ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన అదే సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్పుకున్న సీతారామ శాస్త్రి కలం సుంచి ఎన్నో మరెన్నో అద్భుతమైన పాటలు పుట్టుకొచ్చాయి. ఆయన కలం నుండి జాలువారిన ఏ ఒక్క పాట విన్నా చాలు అందులోని సాహిత్యాన్ని బట్టి అది ఖచ్చితంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గా సాహిత్యమేనని చెప్పేయొచ్చు.

టాలీవుడ్ లో మంచి సినీ గేయ రచయితగా పేరు ప్రఖ్యాతలు గడిపిన సీతారామశాస్త్రి ఆమధ్య ‘గాయం’ చిత్రంలో ఓ విలేకరి పాత్రలో వెండితెరపై తళుక్కున మెరిశారు. లేటెస్ట్ గా మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయన వారసత్వాన్ని అందిపుచ్ఛుకున్న ఆయన కొడుకు రాజా కూడా వెండితెరపై నటుడిగా తన ప్రతిభను చూపిస్తున్నాడు. అసలు రాజాని చూస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు అని ఎవరూ గుర్తించలేరు కూడా.! ఎందుకంటే.. ఎక్కడా కూడా తన తండ్రి పేరును వాడుకోకుండా తనదైన నటనా ప్రతిభతో సినిమా రంగంలో వైవిధ్యమైన పాత్రలతో అందరినీ అలరిస్తున్నాడు. ఇతని పూర్తి పేరు చెంబోలు రాజా. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజా..

ఇంతవరకూ ‘ఫిదా, అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ’ వంటి ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించాడు. ఏంటీ.. ఇంకా మీరు రాజాని గుర్తు పట్టలేదా.? ‘ఫిదా’ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ కి అన్న పాత్రలో నటించింది.. ‘ఎవడు’ చిత్రంలో రామ్ చరణ్ కి ఫ్రెండ్ గా నటించింది..

ఆతరువాత ‘ABCD’ చిత్రంలో యువజన నాయకుడిగా నటించింది మన రాజాయే.! ఇవే కాకుండా.. ఇంకా ఇద్దరిలోకం ఒక్కటే, అజ్ఞాతవాసి, భానుమతి రామకృష్ణ, వి వంటి చిత్రాలలో కూడా నటించాడు. అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ ‘సవ్వడి’ లో నటించిన రాజా ప్రస్తుతం ‘మస్తీ’ వంటి వెబ్ సీరీస్ లలో కూడా నటించాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago