ఇండియాలో ప్రతీ ప్రేక్షకుడు ఎక్కువగా ఇష్టపడే విషయాల్లో క్రికెట్ ఒకటైతే.. మరొకటి సినిమా. ఇక ఇక్కడ క్రికెట్ గురించి చెప్పుకుంటే.. ఆస్ట్రేలియా కంటే వన్డేలో వరల్డ్ కప్ లు గెలుచుకుంది తక్కువే అయినా.. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హీరోల కంటే కూడా టీమిండియా క్రికెటర్లకే ఎక్కువ పాపులారిటీ ఉందనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా రథసారధి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఉన్న రికార్టులను త్వరలోనే కోహ్లీ అధిగమించే సత్తా కూడా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా చెప్పిన విషయం తెలిసిందే. అంతలా తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాందించుకున్నాడు విరాట్.
2013 సంవత్సరంలో హెడ్ అండ్ షోల్డర్స్ షాంప్ ప్రకటన కోసం మొదటిసారిగా కలిసిన విరాట్, అనుష్క వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లింది. వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతక ముందే విరాట్ చాలామందితో ప్రేమాయణం నడిపినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో పాపులర్ హీరోయిన్లు కూడా ఉన్నట్లు టాక్. విరాట్ కోహ్లీకి మొదటి లవ్ తమిళం, కన్నడంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాక్షి అగర్వాల్ తో ప్రేమాయాణం నడిపాడు.
ఆర్సీబీకి మద్దతుగా స్డేడియానికి వచ్చినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడి.. తర్వాత వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఇషా బెల్లాతో రెండు ఏళ్లు లవ్ ఎపైర్ నడిపాడు. ఈమె బ్రెజిల్ కు చెందిన మోడల్. కొన్ని ఇండియన్ మూవీల్లో కూడా నటించింది. అమీర్ ఖాన్ తలాష్ మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా బెల్లా. తెలుగులోని విజయ్ దేవర కొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలోనూ నటించింది. 2013లో విరాట్ కోహ్లీతో ప్రేమాయణం నడిపింది. సింగపూర్ లో వీళ్లిద్దరూ కలిసి షాపింగ్ లాంటివి చేస్తుండగా మీడియాలకు కూడా దొరికిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.
విరాట్ కోహ్లీ హీరోయిన్ తమన్నాతో కలిసి 2012 లో ఓ అడ్వైజ్‌మెంట్‌లో నటించాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల వరకు ప్రేమాయాణం నడిచినట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంపీఎల్ యాప్ కోసం ఇద్దరు మరో సారి యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా కన్నడ నటి సంజన గల్రానీతో కూడా కోహ్లీ లవ్ లో ఉన్నాడట. ఆమె బుజ్జిగాడు సినిమాలో నటించింది. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది సంజన గల్రానీ. పంజా సినిమాలో నటించిన సారా జేన్ దియాస్ తో కూడా విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్‌క్రీమ్‌ను…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్‌క్రీమ్‌ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…
మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…