“బాహుబలి” తో తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకధీరుడు రాజమౌళి, అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
అయితే తాజగా విజయేంద్ర ప్రసాద్ “అలీతో సరదాగా” షోలో పలు ఆశక్తికర విషయాలు బయటపెట్టారు. “మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అని హోస్ట్ అలీ అడగడంతో అందరూ షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చారు.’ అలీ అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్… ఇంకెవరు “పూరీ జగన్నాథ్” అని సమాధానం చెప్పారు. అంతేకాదు పూరీ జగన్నాథ్ అంటే తనకు అసూయ ఆని, ఆయన తన శాత్రువు అని.. “నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను” అని నవ్వుతూ అందరూ ఆశ్చర్యపోయేలా చూపించారు విజయేంద్ర ప్రసాద్. దీనితో ఆ పోస్ట్ కాస్త వైరల్ అయిన విషయం తెలిసిందే..
అయితే ఇక్కడే కొత్త చిక్కొచ్చి పడింది విజయేంద్ర ప్రసాద్ కి. నా ఫోన్‌లో ఉన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వాల్ పేపర్ చూడండి అని అయన ఫోన్ చూపిస్తే.. దాంతో పాటు ఆయన ఫోన్‌లో ఏయే యాప్‌లు ఉన్నాయా అని భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు నెటిజన్లు. అయితే విజయేంద్ర ప్రసాద్ ఫోన్‌లో “ప్లే ఇట్” యాప్ కనిపించడంతో… ‘రాజమౌళి గారి ఫాదర్ ఫాదర్ కూడా పైరసీ యూజ్ చేస్తున్నార్రా…’ అంటూ మీమ్స్ క్రియేట్స్ చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…