సినీనటుల పెళ్లంటే భారీ సెట్టింగులతో, ఆకాశమంత పందిరితో సుమారు నాలుగు రోజుల పాటు వారి పెళ్ళిసందడి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కోవిడ్ కాలం కావడంతో. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడమే కష్టమైపోతుంది. ఒకవేళ చేసుఉన్నా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో తూ తూ మంత్రంగా కానిచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరకంగా ఇటువంటి దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చింది కరోనా.. అయితే ఇటువంటి సమయంలో చప్పుడు లేకుండా పెళ్ళిళ్ళు కానిచ్చేస్తున్నారు సినీ ప్రముఖులు. హీరో నిఖిల్, రానా, హీరోయిన్ కాజల్ పెళ్ళిళ్ళు అలాగే జరిగాయి కూడా.. అంతెందుకు మొన్న హీరోయిన్ ప్రణిత కూడా ఇలానే సైలెంట్ గా పెళ్ళిచేసుకుని ఫోటోలు బయటపెట్టింది. అయితే తాజగా మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా అదేబాటలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. అందం, అభినయం ఉన్నా పెద్దగా సక్సెస్ కాలేదు లావణ్య త్రిపాఠికి.. మొన్నామధ్య వచ్చిన “చావు కబురు చల్లగా” కూడా భారీ డిజాస్టర్ అందుకుంది. మెగా కాంపౌండ్ లో ఉంటూ అడపాడడపా అవకాశాలు అందుకుంటున్నా.. పాపం హిట్ అందుకుని ఎన్నిరోజులు అయిందో.. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి మాత్రమె బెస్ట్ ఆప్షన్ అనుకుంటుందట ఈ సొట్టబుగ్గల ముద్దుగుమ్మ.
అయితే ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ సైలెంట్ గా నిత్సితార్ధం చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వస్తున్నాయి. త్వరలోనే ఏడుఅడుగులు నడుస్తుందని.. త్వరలోనే దీనికి సంబంధిన వివరాలు రాబోతున్నాయని సమాచారం. అయితే హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా సైలెంట్ గా, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆమె అభిమానులు. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో త్వరలోనే తేలిపోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…