“అబ్బాస్..” పరిచయం అక్కర్లేని పేరు.. ఒకానొక సమయంలో అబ్బాస్ హెయిర్ కటింగ్ అంటూ కొన్నేళ్ళ పాటు ఆ ట్రెండ్ కొనసాగిన విషయం తెలిసిందే.. అంతేకాదు ఆ సమయంలో ఈ పేరు వింటే పడి చచ్చేవాళ్ళు అమ్మాయిలు. ఇక ఈయన హెయిర్ స్టైల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది..
“ప్రేమదేశం” సినిమాతో 1996 ప్రేక్షకుల ముందుకు వచ్చి కేవలం మొదటి సినిమాతోనే విపరీతమిన ఫాలోయింగ్ సంపాదించుకున్న కొద్దిప్పటి నటీనటులలో అబ్బాస్ ఒకరు. వెస్ట్ బెంగాల్, హౌరాలో పుట్టిన అబ్బాస్.. తెలుగు, తమిళ సినిమాలతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో “ప్రేమదేశం” సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు.. ఆ సినిమాతో ఒక్కసారిగా ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు అబ్బాస్. ఆతరువాత వచ్చిన “ప్రియా ఓ ప్రియా” అబ్బాస్ కి తోలి స్ట్రైట్ తెలుగు సినిమా.
అయన కెరీర్ మొత్తంలో 50కి పైగా సినిమాలలో నటిస్తే అందులో 10 సినిమాలు తెలుగులోనే ఉన్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు అబ్బాస్. అయితే ప్రస్తుతం ఈయన ఎక్కడ ఉంటున్నారు. ఎం చేస్తున్నారు అనే విషయాలు ఎవరికీ తెలియవు. ఇక అసలు విషయానికి వస్తే.. అబ్బాస్ న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. నటుడిగా, మోడల్ గా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్న అబ్బాస్ ఇప్పుడు.. మోటివేషనల్ స్పీకర్ గా జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. ప్రసుతం న్యూజిలాండ్ లో మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఎవరికీ ఎటువంటి సలహాలు కావాల్సినా తనదైన రీతిలో సలహాలు అందిస్తున్నారు అబ్బాస్. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటారు అబ్బాస్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…