కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్. ఇటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ వ్యాక్సిన్స్ వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజగా ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మైయోకార్డిటిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. దీనివల్ల గుండె పొరల్లో స్వల్ప స్థాయిలో వాపు వస్తుందని. ఈ విషయాన్ని గుర్తించినట్టు ఇజ్రాయిల్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
ఇందులో ముఖ్యంగా మగవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. తమ దేశంలో గత ఏడాది డిసెంబర్ నాటి నుంచి ఈ ఏడాది మే చివరి వరకు మొత్తం 275 మైయోకార్డిటిస్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. అయితే ఇజ్రాయిల్ లో ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మందికి వ్యాక్సిన్ లు వేశారు. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై పరిశోధన చేసి ఆ సమాచారాన్ని ఇజ్రాయిల్ ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దీనిపై స్పందించిన ఫైజర్ సంస్థ మాత్రం ఇటువంటి సమస్యలు ఉన్న కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇజ్రాయిల్ గుర్తించిన మైయోకార్డిటిస్ లక్షణాలను తాము కూడా స్టడీ చేస్తున్నట్టు పేర్కొంది ఫైజర్ సంస్థ. అయితే ఫైజర్ వ్యాక్సిన్ కు ఈ లక్షణాలకు సంబంధం ఉందని అనలేమని. వ్యాక్సిన్ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ గురించి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుందని తెలిపింది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…